Share News

Bomb Threats: 48 గంటల్లో 10 విమానాలకు బాంబు బెదిరింపు.. దర్యాప్తునకు ఆదేశం

ABN , Publish Date - Oct 15 , 2024 | 09:28 PM

సరిగ్గా ఇదే సమయంలో భారత్, కెనడా మధ్య మాటల యుద్దం జరుగుతుంది. నిజ్జర్ హత్య కేసులో కెనడాలోని భారత రాయబారి వర్మ పేరు ప్రస్తావించింది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ క్రమంలో భారత్‌లోని కెనడా రాయబారితో పాటు ఆ కార్యాలయంలోని నలుగురు ఉద్యోగులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.

Bomb Threats: 48 గంటల్లో 10 విమానాలకు బాంబు బెదిరింపు.. దర్యాప్తునకు ఆదేశం

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: వరుస పెట్టి విమానాలకు బాంబు బెదిరింపులు వెల్లువెత్తుతున్నాయి. జస్ట్ 48 గంటల్లో 10 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా మంగళవారం న్యూఢిల్లీ నుంచి చికాగో బయలుదేరిన విమానానికి సైతం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానాన్ని దారి మళ్లించి.. కెనడాలోని ఇకాలూయిట్ విమానాశ్రయానికి మళ్లించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నట్లు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఉన్నతాదికారులు వెల్లడించారు.

AP High Court: కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులను సిఫార్సు చేసిన సుప్రీం కొలిజీయం


అమెరికా వెళ్తున్న విమానంతోపాటు మొత్తం ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయన్నారు. ఇక అమెరికా వెళ్తున్న విమానానికి మంగళవారం మధ్యాహ్నం సోషల్ మీడియా వేదికగా బెదిరింపులు వచ్చాయని గుర్తు చేశారు. ఈ విమానం ఈ రోజు తెల్లవారుజామున 3.00 గంటలకు ఢిల్లీ నుంచి యూఎస్‌లోని చికాగోకు బయలుదేరిందన్నారు. కొద్ది సేపటి తర్వాత బాంబు బెదిరింపు రావడంతో.. భద్రత కారణాల రీత్య కెనడాకు దారి మళ్లించేందుకు నిర్ణయించామని చెప్పారు.

Also Read: మాజీ సీఎం జగన్‌రెడ్డికి పట్టాభిరామ్ చురకలు

Also Read: వయనాడ్ ఉప ఎన్నిక తేదీని ప్రకటించిన సీఈసీ


ఇక సౌదీ అరేబియాలోని డమన్ నుంచి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు బయలుదేరిన ఇండిగో విమానానికి సైతం బాంబు బెదిరింపు రావడంతో.. జైపూర్‌లో అత్యవసరంగా దింపివేసినట్లు తెలిపారు. తమకు ప్రయాణికులు, విమాన సిబ్బంది భద్రత ముఖ్యమని స్పష్టం చేశారు. అలాగే జైపూర్ నుంచి అయోధ్య బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి సైతం బాంబు బెదిరింపు వచ్చిందన్నారు. దీంతో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు అత్యవసరంగా ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చామని తెలిపారు.

Also Read: బుధవారం ఏపీ కేబినెట్ భేటీ.. ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశం

Also Read: Viral Video: రైలు విండోలో నుంచి జారీ పడిన చిన్నారి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?


ఇదే తరహా బాంబు బెదిరింపులు సోమవారం సైతం వచ్చాయని వివరించారు. అందులో అంతర్జాతీయ విమానాలు సైతం ఉన్నాయన్నారు. ఈ తరహా బెదిరింపుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశాలున్నాయని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నామని చెప్పారు. ఆ క్రమంలో దర్యాప్తునకు ఆదేశించినట్లు వివరించారు.

Also Read: ట్రాఫిక్‌లో చిక్కుకున్నారా? ఇలా చేయండి.. జస్ట్ సెకన్‌లో పోలీసులు మీకు ఫోన్ చేస్తారు..?

Also Read: పండగ వేళ.. పలు ప్రత్యేక రైళ్లు


మరోవైపు సరిగ్గా ఇదే సమయంలో భారత్, కెనడా మధ్య మాటల యుద్దం జరుగుతుంది. నిజ్జర్ హత్య కేసులో కెనడాలోని భారత రాయబారి వర్మ పేరు ప్రస్తావించింది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ క్రమంలో భారత్‌లోని కెనడా రాయబారితో పాటు ఆ కార్యాలయంలోని నలుగురు ఉద్యోగులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అందుకు వారికి కొంత గడువు సైతం ఇచ్చింది. అలాగే కెనడాలోని భారత రాయబారిని సైతం దేశం విడిచి వెళ్లాలని ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. ఇటువంటి పరిస్థితులు ఈ ఇరు దేశాల మధ్య కొనసాగుతున్నాయి. అలాంటి వేళ.. న్యూఢిల్లీ నుంచి అమెరికా బయలుదేరిన విమానం.. బాంబు బెదిరింపు కారణంగా.. కెనడాకు దారి మళ్లించాల్సి వచ్చింది.

For National News And Telugu News

Updated Date - Oct 15 , 2024 | 09:31 PM