Modi Swearing Ceremony: ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి ఈ దేశాల అగ్రనేతలకు ఆహ్వానం!
ABN , Publish Date - Jun 06 , 2024 | 07:52 AM
2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వంపై ఉన్న ఉత్కంఠ ఇప్పటికే తొలగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ శనివారం జూన్ 8న ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. ఈ క్రమంలో మోదీ ప్రమాణ స్వీకారోత్సవ(Swearing Ceremony) కార్యక్రమానికి పొరుగు దేశాల నేతలతోపాటు మరికొంత మంది పాల్గొననున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వంపై ఉన్న ఉత్కంఠ ఇప్పటికే తొలగిపోయింది. దేశంలో మూడోసారి మోదీ(Narendra Modi) ఆధ్వర్యంలో వరుసగా మూడోసారి తమ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఎన్డీయే సమావేశంలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ శనివారం జూన్ 8న ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. దీంతో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవ(Swearing Ceremony) కార్యక్రమానికి పొరుగు దేశాల నేతలతోపాటు మరికొంత మంది పాల్గొననున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, అమెరికా సహా పలు దేశాల నేతలను ఆహ్వానిస్తారని తెలుస్తోంది.
ప్రమాణ స్వీకారోత్సవానికి మోదీ తనను ఆహ్వానించారని శ్రీలంక(srilanka) అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కార్యాలయ మీడియా విభాగం తెలిపింది. విక్రమసింఘే ఆహ్వానాన్ని అంగీకరించారని, ఎన్నికల్లో విజయం సాధించిన మోదీకి ఫోన్‌లో అభినందనలు తెలిపారు. బంగ్లాదేశ్(bangladesh) ప్రధాని షేక్ హసీనాతోనూ మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఫోన్ సంభాషణ సందర్భంగా మోదీ తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని హసీనాను ఆహ్వానించారని, అందుకు ఆమె అంగీకరించారని దౌత్య వర్గాలు తెలిపాయి.
మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి నేపాల్(nepal) ప్రధాని పుష్ప కమల్ దహల్ 'ప్రచండ', భూటాన్(bhutan) ప్రధాని షెరింగ్ టోబ్గే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్‌లను కూడా ఆహ్వానించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నరేంద్ర మోదీ కూడా 'ప్రచండ'తో ఫోన్‌లో మాట్లాడారు. అధికారికంగా గురువారం ఆహ్వానాలు పంపనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
మరోవైపు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని స్వేచ్ఛా, సురక్షితంగా మార్చేందుకు భారత్‌తో కలిసి అమెరికా కృషి చేస్తుందని అమెరికా(america) విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. రెండు దేశాల మధ్య ప్రజల-ప్రజల మధ్య సంబంధాలను మరింతగా పెంచడానికి విదేశాంగ శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. అయితే మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తమకు ఇంకా ఆహ్వానం రాలేదని వస్తే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఇక ప్రధానిగా మోదీ(modi) తొలి ప్రమాణ స్వీకారోత్సవానికి దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (saarc) నేతలు హాజరయ్యారు. 2019లో నరేంద్ర మోదీ వరుసగా రెండోసారి ప్రధాని అయినప్పుడు, ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి బిమ్స్‌టెక్ దేశాల నేతలు హాజరయ్యారు. జూన్ 8న మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో మరికొంత మంది నేతలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రధాని మోదీ విజయం సాధించినందుకు 75 దేశాల ప్రతినిధుల నుంచి అభినందనలు వచ్చాయి.
ఇది కూడా చదవండి:
Priyanka Gandhi : అన్నా.. గర్విస్తున్నా!
Read Latest National News and Telugu News