Share News

IPS officers: 11 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:43 PM

తిరుప్పూర్‌, తిరువళ్లూర్‌ జిల్లా ఎస్పీలు సహా 11 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

IPS officers: 11 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

పెరంబూర్‌(చెన్నై): తిరుప్పూర్‌, తిరువళ్లూర్‌ జిల్లా ఎస్పీలు సహా 11 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

- తిరుప్పూర్‌ ఎస్పీ స్వామినాథన్‌, చెన్నై అవినీతి నిరోధక శాఖ ఎస్పీగా నియమితులయ్యారు.

- తిరువళ్లూర్‌ ఎస్పీ పాకెర్ల కల్యాణ్‌, చెన్నై దక్షిణ మండల ఆర్థిక నేర విభాగ ఎస్పీగా నియమితులయ్యారు.

- తిరువళ్లూర్‌ ఎస్పీగా శ్రీనివాస పెరుమాళ్‌ నియమితులయ్యారు.

- తిరుప్పూర్‌ నగర శాంతి భద్రతల విభాగం డిప్యూటీ కమిషనర్‌గా కోయంబత్తూర్‌ డిప్యూటీ కమిషనర్‌ ఎం.నాగరాజన్‌

- మదురై డిప్యూటీ కమిషనర్‌ అనిత తిరునల్వేలి డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ.

- తిరుప్పూర్‌ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న అభిషేక్‌ గుప్తా... తిరుప్పూర్‌ ఎస్పీగా బదిలీ.

- చెన్నై కొళత్తూర్‌ డిప్యూటీ కమిషనర్‌గా ఐపీఎస్‌ అధికారి పాండ్యరాజన్‌ నియామకం.

- చెన్నై ఉత్తర అవినీతి నిరోధక విభాగం ఎస్పీగా వి.శరవణకుమార్‌, చెన్నై సీఐడీ ఎస్పీగా ఎస్‌.శక్తివేల్‌, కేంద్ర విజిలెన్స్‌ విభాగం ఎస్పీగా వి.శ్యామల దేవిని బదిలీ చేశారు.

Updated Date - Jan 28 , 2024 | 12:43 PM