IRCTC: రైల్వే ప్రయాణీకులకు సూపర్ న్యూస్.. ఇక ఆ కష్టాలన్నీ తీరినట్లే..
ABN , Publish Date - Apr 11 , 2024 | 07:33 PM
భారతీయ రైల్వేలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టు. భారీ నెట్ వర్క్ తో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలుస్తోంది భారతీయ రైల్వే ( Indian Railway ). నిరంతరం లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తూ సేవలు అందిస్తున్నాయి.
భారతీయ రైల్వేలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టు. భారీ నెట్ వర్క్ తో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలుస్తోంది భారతీయ రైల్వే ( Indian Railway ). నిరంతరం లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తూ సేవలు అందిస్తున్నాయి. దేశాన్ని ఒక మూల నుంచి మరో మూలకు అనుసంధానం చేయడంలో రైల్వేల పాత్ర ఎనలేనిది. కొన్నేళ్లుగా రైల్వేలు అప్ గ్రేడ్ అయ్యాయి. గంటల కొద్దీ క్యూలైన్లల్లో నిల్చుని సేవలు పొందే అవకాశం లేకుండా టెక్నాలజీతో ఇంట్లో ఉంటూనే అన్ని రకాల పనులు చక్కదిద్దుకునే వెసులుబాటు వచ్చేసింది. అనేక సమస్యలకు సాంకేతికత పరిష్కారాలు చూపింది.
AAP: ఈడీ బెదిరింపులతోనే రాజ్ కుమార్ రాజీనామా.. అతిశీ కామెంట్స్..
రైల్వే సేవలు పొందేందుకు ప్రత్యేక యాప్ లు అనేకం ఉన్నాయి. వీటి వల్ల ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోంది. వారి ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న రైల్వే ఉన్నతాధికారులు ఓ సూపర్ యాప్‌ను డెవలప్ చేస్తున్నారు. అన్ని రకాల సేవలు అందుబాటులో ఉండే విధంగా రూపొందిస్తున్నారు. దీంతో ప్రయాణికుల ఇబ్బందులు తీరనున్నాయి. ఈ సూపర్ యాప్ సాంకేతికంగా చాలా అధునాతనంగా ఉంటుంది. ఈ యాప్ ద్వారా టికెట్ బుకింగ్, రైలు ట్రాకింగ్ వంటివి చూసుకోవచ్చు. దీనితో పాటు టికెట్ వాపసు కోసం 24 గంటల సేవను కూడా ప్రారంభించనుంది.
Kavitha: కోర్టులో కవితకు ఎదురుదెబ్బ.. రిలీఫ్ ఇవ్వలేమన్న న్యాయస్థానం..
మరోవైపు.. ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ భారతీయ రైల్వేల్లో అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ అప్లికేషన్ గా గుర్తింపు పొందింది. దాదాపు 10 కోట్ల డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది. రైల్ మదద్, యూటీఎస్, టీఎంఎస్ నిరీక్షణ్, ఐఆర్సీటీసీ ఎయిర్, పోర్ట్ రీడ్ వంటి అనేక ఇతర యాప్‌లూ సేవలు అందిస్తున్నాయి.
మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.