Muslims: ముస్లింలకు మోదీ వ్యతిరేకమా? ప్రధాని ఏమన్నారంటే
ABN , Publish Date - May 08 , 2024 | 09:12 AM
తాను ఇస్లాంకు, ముస్లింలకు వ్యతిరేకం కాదని ప్రధాని మోదీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచుతుందంటూ తాను చేసిన వ్యాఖ్యను సమర్థించుకుంటూ.. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఆ విషయం ఉందన్నారు
ఢిల్లీ: తాను ఇస్లాంకు, ముస్లింలకు వ్యతిరేకం కాదని ప్రధాని మోదీ(PM Modi) చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచుతుందంటూ తాను చేసిన వ్యాఖ్యను సమర్థించుకుంటూ.. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఆ విషయం ఉందన్నారు (తమ ఎన్నికల ప్రణాళికలో ఇటువంటి అంశం లేనేలేదని కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టం చేసింది).
అయితే, ముస్లింలు తెలివైన వారని, కాంగ్రెస్ అబద్ధాలను వారు నమ్మటం లేదని, ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌కు సమస్యగా మారిందన్నారు. టైమ్స్‌నౌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ముస్లిం సమాజం ఆలోచించాలి. దేశం ప్రగతి పథంలో ఉంది.
మీ వద్ద ఏమైనా పొరపాట్లు, పరిమితులు ఉన్నాయని భావిస్తే దానికి కారణాలేమిటో గుర్తించాలి’ అని మోదీ పేర్కొన్నారు. ముస్లింలు తమ భవిష్యత్తు గురించి, తమ పిల్లల గురించి ఆలోచించుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి:
West Bengal: నియామకాల రద్దుపై స్టే.. కానీ సీబీఐ విచారణ జరపండి
Read Latest National News and Telugu News