Share News

Jammu Kashmir Assembly Polls: తండ్రి తరఫున నామినేషన్ వేసిన సుగ్రా బర్కతి

ABN , Publish Date - Aug 28 , 2024 | 09:59 AM

జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి జరగనున్న తొలి దశ ఎన్నికల్లో మొత్తం 279 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. అనంత్‌నాగ్ అసెంబ్లీ స్థానం నుంచి అత్యధికంగా 72 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ దశలో 7 జిల్లాలోని మొత్తం 24 స్థానాలకు పోలింగ్ జరగనుంది. వ్యాలీలోని 16 స్థానాలతోపాటు జమ్మూ ప్రాంతంలోని 8 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Jammu Kashmir Assembly Polls: తండ్రి తరఫున నామినేషన్ వేసిన సుగ్రా బర్కతి

శ్రీనగర్, ఆగస్ట్ 28: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి తొలి విడత ఎన్నికల పోలింగ్‌కు అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ మంగళవారం అంటే.. ఆగస్ట్ 27వ తేదీ సాయంత్రంతో ముగిసింది. ఈ దశ ఎన్నికల్లో మొత్తం 279 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. అనంత్‌నాగ్ అసెంబ్లీ స్థానం నుంచి అత్యధికంగా 72 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ దశలో 7 జిల్లాలోని మొత్తం 24 స్థానాలకు పోలింగ్ జరగనుంది. వ్యాలీలోని 16 స్థానాలతోపాటు జమ్మూ ప్రాంతంలోని 8 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Also Read: Himachal Pradesh: కంగన వ్యాఖ్యలపై కీలక నిర్ణయం


మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు..

జమ్మూ కశ్మీర్‌‌లో మొత్తం 90 స్థానాలున్న అసెంబ్లీకి మూడు విడతలుగా పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అందులోభాగంగా సెప్టెంబర్ 18వ తేదీన రాష్ట్రంలో జరిగే తొలి విడత పోలింగ్‌కు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో తొలి విడత పోలింగ్‌కు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మిగలిన రెండు విడతలు.. సెప్టెంబర్ 25, ఆక్టోబర్ 1వ తేదీన జరగనున్నాయి.

Also Read: Nagpur: నగదు కోసం శిశువు విక్రయం: ఆరుగురు అరెస్ట్


ఆగస్ట్ 30తో ముగియనున్న గడువు..

ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆక్టోబర్ 4వ తేదీన వెలువడనున్నాయి. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. బీజేపీ, పీడీపీ, పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. దాదాపు దశాబ్దం తర్వాత ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో.. జమ్మూ కశ్మీర్ ఓటరు ఏ పార్టీకి పట్టం కడతారనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇక తొలి విడత పోలింగ్‌కు సంబంధించి.. అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ఈ రోజు జరుగుతుంది. అభ్యర్థుల నామినేషన్లు ఉపసంహరణ గడువు ఆగస్ట్ 30వ తేదీతో ముగియనుంది.


బరిలో మత గురువు.. తండ్రి తరఫున నామినేషన్ వేసిన కుమార్తె

తొలి విడత పోలింగ్ వేళ.. కాశ్మీర్ వేర్పాటువేది, మత గురువు సర్జన్ బర్కతి నామినేషన్‌ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. షోపియాన్ జిల్లా, జైన్‌పూరా అసెంబ్లీ స్థానం నుంచి ఆయన బరిలో దిగనున్నారు. ఆయన నామినేషన్ పత్రాలను సోమవారం సర్జన్ బర్కతి కుమార్తె సుగ్రా బర్కతి సమర్పించారు. తండ్రి తరఫున ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రస్తుతం సర్జన్ బర్కతి దంపతులు జైల్లో ఉన్నారు. దీంతో ఆయన కుమార్తె నామిషన్ వేశారు.


ఎన్‌కౌంటర్‌లో బుర్హన్ వనీ మృతి.. అనంతరం చోటు చేసుకున్న హింసలో..

2016, జులై 8వ తేదీన జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజబుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ మరణించాడు. దీంతో రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో సర్జన్ బర్కతి అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఈ హింసలో దాదాపు 90 మంది మరణించారు. ఆ క్రమంలో సర్జన్ బర్కతిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2020, అక్టోబర్‌లో అతడిని జైలు నుంచి విడుదల చేశారు.


భర్తతోపాటు భార్య అరెస్ట్.. అందుకే..

అయితే విదేశాల నుంచి వచ్చే కోట్లాది నిధులను దారి మళ్లిస్తున్నట్లు సర్జన్ బర్కతిపై విమర్శలు రావడంతో.. స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎస్ఐఏ).. 2023లో అతడిని అరెస్ట్ చేశారు. అలాగే అతడి భార్యను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అతడి కుమార్తె సుగ్రా బర్కతి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. 2016లో సర్జన్ బర్కత్.. ఉమత్ ఈ ఇస్లామీ అనే మత సాంఘిక సంస్థను నడిపేవారు.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 28 , 2024 | 10:04 AM