Share News

Jammu and Kashmir: హిజ్బుల్లా చీఫ్ మృతిపై బుద్గావ్‌లో నిరసనలు.. బీజేపీ, పీడీపీ మాటల యుద్ధం

ABN , Publish Date - Sep 29 , 2024 | 03:45 PM

హిజ్బుల్లాకు మద్దతుగా వందలాది మంది బుద్గావ్‌లో ఆదివారం జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. మరోవైపు, హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మృతికి నిరసనగా ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేస్తున్నట్టు పీడీపీ చీఫ్ మొహబూబా ముఫ్తీ ప్రకటించారు.

Jammu and Kashmir: హిజ్బుల్లా చీఫ్ మృతిపై బుద్గావ్‌లో నిరసనలు.. బీజేపీ, పీడీపీ మాటల యుద్ధం

జమ్మూ: లెబనాన్‌ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా (Hassan Nasrallah) మృతిపై జమ్మూకశ్మీర్‌లోని బుద్గాంలో ఆదివారంనాడు నిరసనలు చోటుచేసుకున్నాయి. హిజ్బుల్లాకు మద్దతుగా వందలాది మంది ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. మరోవైపు, నస్రల్లా మృతికి నిరసనగా ఎన్నికల ప్రచారాన్ని పీడీపీ చీఫ్ మొహబూబా ముఫ్తీ రద్దు చేయడం జమ్మూకశ్మీర్‌లోని రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దానికి దారితీసింది.


బీజేపీ వర్సెస్ పీడీపీ

నస్రల్లా మృతికి నిరసనగా ఎన్నికల ప్రచారాన్ని పిడీపీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించడాన్ని బీజేపీ నేత, జమ్మూకశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి కవీందర్ గుప్తా తప్పుపట్టారు. బంగ్లాదేశ్‌లో హిందువులను చంపితే మెహబూబా ముఫ్తీ ఒక్కమాట కూడా మాట్లాడిన పాపాన పోలేదని, హనన్ నసరుల్లా మృతి ఆమెకు ఎందుకంత బాధ కల్గించిందని ప్రశ్నించారు. బంగ్లేదేశ్‌లో హిందువులపై దాడులు, హత్యలు జరిగినప్పుడు నోరుమెదపని ఆమె ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని, ఆమె ఉద్దేశం ఏమిటో ప్రజలు అర్థం చేసుకోగలరని అన్నారు.


దీనికి ముందు, మెహబూబా ముఫ్తీ సామాజిక మాధ్యమం 'ఎక్స్‌'లో ఆదివారం జరగాల్సిన పార్టీ ప్రచార కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్టు ప్రకటించారు. పాలస్తీనా, లెబనాన్ ప్రజలకు తమ పార్టీ బాసటగా నిలుస్తుందని అన్నారు. లెబనాన్, గాజాలోని అమరవీరులు, ముఖ్యంగా హసన్ నస్రల్లా ప్రాణత్యాగానికి సంఘీభావంగా తమ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నట్టు చెప్పారు. పాలిస్తీనా, లెబనాన్ ప్రజలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో వారికి తాము సంఘీభావం తెలుపుతున్నామన్నారు.


For National News And Telugu News..

ఇది కూడా చదవండి...

బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేత

Updated Date - Sep 29 , 2024 | 03:46 PM