Share News

UP: ఇండియా కూటమికి షాక్.. బీజేపీతో పొత్తుకు ఆ పార్టీ రెడీ

ABN , Publish Date - Feb 09 , 2024 | 01:51 PM

లోక్ సభ ఎన్నికలకు(Parliament Elections 2024) ముందే విపక్ష ఇండియా కూటమికి(INDIA bloc) షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే బిహార్ సీఎం నితీశ్ కూటమికి గుడ్ బై చెప్పగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు.

UP: ఇండియా కూటమికి షాక్.. బీజేపీతో పొత్తుకు ఆ పార్టీ రెడీ

లఖ్‌నవూ: లోక్ సభ ఎన్నికలకు(Parliament Elections 2024) ముందే విపక్ష ఇండియా కూటమికి(INDIA bloc) షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే బిహార్ సీఎం నితీశ్ కూటమికి గుడ్ బై చెప్పగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఆర్ఎల్‌డీ(RLD) పార్టీ ఇండియా కూటమికి షాక్ ఇచ్చింది. రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీతో ఆర్ఎల్‌డీ పొత్తు ఖ‌రారైంది. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం ప్రకారం ఆర్ఎల్‌డీ యూపీలో 2 లోక్‌స‌భ స్ధానాల్లో పోటీ చేస్తుంది.

బాఘ్ప‌ట్‌, బిజ్నూర్ స్ధానాల్లో ఆర్ఎల్‌డీ పోటీ చేయ‌నుండ‌గా మ‌రో రాజ్య‌స‌భ సీటు కేటాయిస్తామ‌ని ఆ పార్టీ చీఫ్ జయంత్ చౌదరికి బీజేపీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ, ఆర్ఎల్‌డీ పొత్తుకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. జాట్ సామాజిక వర్గ ప్రజలు ఉన్న ప్రాంతాల్లో ఆర్‌ఎల్‌డీ తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఆ సామాజిక వర్గ ఓట్లే టార్గెట్‌గా బీజేపీ ఈ ఎత్తుగడ వేసినట్లు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 09 , 2024 | 01:53 PM