Road Accident: రూ.666 కోట్ల విలువైన ఆభరణాల కంటైనర్ బోల్తా
ABN , Publish Date - May 08 , 2024 | 09:02 AM
కేరళ నుంచి తమిళనాడులోని సేలంకు రూ.666 కోట్ల విలువైన 810 కిలోల బంగారు ఆభరణాలతో బయలుదేరిన కంటైనర్ ఈరోడ్డు జిల్లా చిత్తోడ్ సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో కంటైనర్ డ్రైవర్‌తో పాటు సెక్యూరిటీ గార్డు గాయపడ్డారు.
చెన్నై, మే 7 (ఆంధ్రజ్యోతి): కేరళ నుంచి తమిళనాడులోని సేలంకు రూ.666 కోట్ల విలువైన 810 కిలోల బంగారు ఆభరణాలతో బయలుదేరిన కంటైనర్ ఈరోడ్డు జిల్లా చిత్తోడ్ సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో కంటైనర్ డ్రైవర్‌తో పాటు సెక్యూరిటీ గార్డు గాయపడ్డారు.
ఓ ఆభరణాల సంస్థకు చెందిన బంగారు నగలను లోడ్ చేసుకున్న కంటైనర్ సోమవారం రాత్రి కేరళ సరిహద్దుల నుంచి సేలంకు బయల్దేరింది. చిత్తోడ్ సమత్తువపురం వద్ద ఓ మలుపు తిరిగే ప్రయత్నంలో బోల్తాపడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని ఆభరణాలు మరో కంటైనర్‌లో తరలించారు.
ఇది కూడా చదవండి:
West Bengal: నియామకాల రద్దుపై స్టే.. కానీ సీబీఐ విచారణ జరపండి
IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా
Read Latest National News and Telugu News