Share News

Jharkhand Assembly Elections: జార్ఖండ్‌లో ముగిసిన తొలి విడత పోలింగ్.. ఓటింగ్ ఎంత శాతమంటే..

ABN , Publish Date - Nov 13 , 2024 | 09:33 PM

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ బుధవారం సాయంత్రం ముగిసింది. దీనితోపాటు కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి... దేశంలోని మొత్తం 10 రాష్ట్రాల్లోని మొత్తం 31 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు ఉప ఎన్నిక జరిగింది.

Jharkhand Assembly Elections: జార్ఖండ్‌లో ముగిసిన తొలి విడత పోలింగ్.. ఓటింగ్ ఎంత శాతమంటే..

రాంచీ, నవంబర్ 13: జార్ఖండ్ అసెంబ్లీకి నిర్వహించిన తొలి విడత పోలింగ్ బుధవారం సాయంత్రం ముగిసింది. సాయంత్రం 5.00 గంటల వరకు 64 శాతంపైగా ఓటింగ్ నమోదు అయిందని ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు రాంచీలో వెల్లడించారు. జార్ఖండ్ అసెంబ్లీకి మొత్తం 81 స్థానాలున్నాయి. తొలి విడతలో 43 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక వీటిలో 17 జనరల్, 20 ఎస్టీ రిజర్వుడ్, 6 ఎస్సీ రిజర్వుడ్ స్థానాలున్నాయి.

Also Read: Telangana:సైబర్ నేరగాళ్ల కోసం స్పెషల్ ఆపరేషన్.. 48 మంది అరెస్ట్


బరిలో మొత్తం 638 మంది అభ్యర్థులు..

ఈ తొలి విడత పోలింగ్‌లో 31 అసెంబ్లీ స్థానాల్లోని 950 పోలింగ్ బూత్‌లు అత్యంత సున్నీతమైనవిగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఆ క్రమంలో ఆయా పోలింగ్ బూతల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టింది. అందులోభాగంగా భారీగా భద్రతా దళాలను మోహరించింది. సదరు ప్రాంతంలో పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4.00 గంటలకు ముగిసింది. ఇక మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7.00 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 5.00 గంటలకు ముగిసింది. ఈ తొలి విడత పోలింగ్‌లో మొత్తం 638 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వారిలో 73 మంది మహిళలు ఉన్నారు.

Also Read: AP Politics: బడ్జెట్‌పై జగన్ షాకింగ్ కామెంట్స్


గత అసెంబ్లీ ఎన్నికల్లో..

అయితే జార్ఖండ్‌ అసెంబ్లీకి గత ఎన్నికల్లో హేమంత్ సోరెన్ సారథ్యంలోని జార్ఖండ్ ముక్తి మోర్చ (జేఎంఎం) పార్టీ 30, బీజేపీ 25, కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీలు భాగస్వామ్య పక్షాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దీంతో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Also Read: AP Govt: జగన్ హయాంలో ఆర్థిక వ్యవహారాలను బహిర్గతం చేసిన ‘నివేదిక’


రెండో విడత నవంబర్ 20న..

ఇక జార్ఖండ్‌లో రెండో విడత లేదా తుది విడత పోలింగ్ నవంబర్ 20వ తేదీన జరగనుంది. ఈ ఎన్నికల్లో జార్ఖండ్ ఓటరు ఏ పార్టీకి పట్టం కడతాడనేది మాత్రం నవంబర్ 23వ తేదీన తెలనుంది. మరోవైపు జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఒకే సారి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జార్ఖండ్ అసెంబ్లీకి రెండు విడుతల్లో పోలింగ్ జరుగుతుండగా.. మహారాష్ట్ర అసెంబ్లీకి మాత్రం ఒకే విడతలో పోలింగ్.. అంటే నవంబర్ 20వ తేదీన జరగనుంది. దీంతో జార్ఖండ్‌తోపాటు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఒకేసారి వెలువడనున్నాయి.

Also Read: వైసీపీ సోషల్ మీడియా సైకోలపై వైఎస్ సునీత ఫిర్యాదు


ఇంకోవైపు దేశంలోని 10 రాష్ట్రాల్లోని మొత్తం 31 అసెంబ్లీ స్థానాలకు సైతం బుధవారం ఉప ఎన్నిక జరిగింది. అలాగే కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి కూడా ఈ రోజే ఉప ఎన్నిక జరిగింది. ఈ స్థానం నుంచి రాహుల్ గాంధీ ఎంపీగా గెలుపొందారు. అయితే రాయబరేలి నుంచి సైతం ఆయన విజయం సాధించారు. దీంతో వయనాడ్ ఎంపీ స్థానానికి ఆయన రాజీనామా చేశారు.

Also Read: karthika pournami: కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేయండి చాలు..

Also Read: గాడిద పాలు తాగితే ఇన్ని లాభాలున్నాయా..?


ఈ నేపథ్యంలో సదరు స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఈ స్థానానికి బుధవారం ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బరిలో నిలిచారు. ఆమె గెలుపు నల్లేరు మీద నడక అవుతుందనే ఓ చర్చ సైతం సాగుతుంది. ఈ ఉప ఎన్నికల ఫలితాలు సైతం నవంబర్ 23న వెలువడనున్నాయి.

Also Read: Hyderabad: హోటళ్లలో అధికారులు తనిఖీలు.. విస్తుపోయే నిజాలు

For National News and Telugu News...

Updated Date - Nov 13 , 2024 | 09:35 PM