Share News

Jharkhand: అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్డీయేకు గట్టి దెబ్బ

ABN , Publish Date - Oct 18 , 2024 | 05:32 PM

జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్డీయేకు ఊహించని దెబ్బ తగిలింది. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న ఆల్ జార్ఖాండ్ స్టూడెంట్స్ యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షుడు ఉమాకాంత్ రజక్, బీజేపీ హ్రాట్రిక్ ఎమ్మెల్యే కేదార్ హజ్రాలు జార్ఖాండ్ ముక్తి మోర్చాలో చేరారు.

Jharkhand: అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్డీయేకు గట్టి దెబ్బ

రాంచీ: జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల (Jharkhand Assembly Elections) వేళ ఎన్డీయే (NDA)కు ఊహించని దెబ్బ తగిలింది. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న ఆల్ జార్ఖాండ్ స్టూడెంట్స్ యూనియన్ (AJSU) కేంద్ర ఉపాధ్యక్షుడు ఉమాకాంత్ రజక్, బీజేపీ నేత, జమువా నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎన్నికైన ఎమ్మెల్యే కేదార్ హజ్రాలు జార్ఖాండ్ ముక్తి మోర్చా (JMM)లో శుక్రవారంనాడు చేరారు. ఈ ఇరువురు నేతలు జేఎంఎం టిక్కెట్‌పై జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారనీ, జమువా సీటు నుంచి కేదర్ హజ్రా బరిలో ఉంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Satyendra Jain: మనీ లాండరింగ్‌ కేసులో సత్యేంద్ర జైన్‌కు బెయిల్


కాంగ్రెస్ నేత మంజు దేవి ఇటీవల ఆపార్టీని వదలి బీజేపీలో చేరారు. ఆమెకు ఈసారి జమువా నియోజకవర్గం నుంచి బీజేపీ టిక్కెట్ ఇస్తుందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కేదార్ హజ్రా జేఎంఎం పార్టీలోకి చేరాలనే నిర్ణయం తీసుకున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ముంజూ దేవిపై కేదార్ హజ్రా 18,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.


81 సీట్లలోనూ పోటీ చేస్తాం

అసెంబ్లీ ఎన్నికల్లో 81 సీట్లకూ తమ పార్టీ పోటీ చేస్తుందని జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గత వారంలో ప్రకటించారు. పార్టీ పూర్తి ఎన్నికల సన్నద్ధతతో ఉందని, జేఎంఎం కూటమి తిరిగి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమిని అన్నారు. విపక్ష బీజేపీ తరహాలో జేఎంఎం కూటమి ప్రకటనలకు మాత్రమే పరిమితం కాదని, అనేక సంక్షేమ పథకాలను అధికార కూటమి అమలు చేస్తోందని చెప్పారు. డబుల్ ఇంజన్ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ 2019లో జేఎంఎం కూటమి ప్రజలు విజయం కట్టబెట్టారని, ఈసారి కూడా విజయం తమదేనని జేఎంఎం ఎమ్మెల్యే, సోరెన్ భార్య కల్పనా సోరెన్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతలుగా జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.


Read More National News and Latest Telugu News

ఇది కూడా చదవండి..

Gurpatwant Singh Pannun: ఖలిస్థానీ ఉగ్రవాది హత్యకు కుట్రలో బిగ్ ట్విస్ట్.. భారత 'రా' అధికారిపై అమెరికా అభియోగాలు..

Updated Date - Oct 18 , 2024 | 05:32 PM