Share News

Jharkhand Elections: జార్ఖాండ్ ఎలక్షన్ డే.. తొలివిడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

ABN , Publish Date - Nov 12 , 2024 | 07:12 PM

రాష్ట్రవ్యాప్తంగా 15, 344 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, 200 కంపెనీల భద్రతా బలగాలను మోహరించారు. తొలి విడతలో భాగంగా 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుండగా, వీటిలో 17 జనరల్ సీట్లు, 20 ఎస్‌సీ రిజర్వ్‌డ్ సీట్లు, ఆరు ఎస్‌సీ రిజర్వ్‌డ్ సీట్లు ఉన్నాయి.

Jharkhand Elections: జార్ఖాండ్ ఎలక్షన్ డే.. తొలివిడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

రాంచీ: జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల (Jharkhand Assembly Elections) తొలి విడత పోలింగ్‌ (First phase polling) బుధవారంనాడు జరుగనుంది. పోలింగ్ సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 15, 344 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, 200 కంపెనీల భద్రతా బలగాలను మోహరించారు. తొలి విడతలో భాగంగా 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుండగా, వీటిలో 17 జనరల్ సీట్లు, 20 ఎస్‌సీ రిజర్వ్‌డ్ సీట్లు, ఆరు ఎస్‌సీ రిజర్వ్‌డ్ సీట్లు ఉన్నాయి. 73 మంది మహిళా ఉభ్యర్థులతో పాటు 683 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో పోటీ పడుతున్నారు.

Yogi Adityanath: కుటుంబ త్యాగాలు ఖర్గేకు గుర్తులేవా?.. సూటిగా ప్రశ్నించిన యోగి


కాగా, బుధవారం ఉదయం 5.30 గంటలకు మాక్ పోల్ ప్రారంభమవుతుందని, అనంతరం పోలింగ్ ప్రక్రియ మొదలవుతుందని రాంచీ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఉత్కర్ష్ కుమార్ తెలిపారు. అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద భద్రత, సీఏపీఎఫ్ బలగాల మొహరింపు ఉంటుందని, ఓటర్లకు తాగునీరు, టాయెలెట్ల్ వంటి కనీస సదుపాయలు, వెబ్‌కేస్టింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎన్నికల నిబంధలకు అనుగుణంగా ఏర్పాటు జరిగినట్టు చెప్పారు.


కీలక అభ్యర్థులు

సరైకెలా నియోజకవర్గం నుంచి జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి చంపయి సోరెన్ పోటీ చేస్తుండగా, జంషెడ్‌పూర్ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అజాయ్ కుమార్ పోటీలో ఉన్నారు. జంషెడ్‌పూర్ వెస్ట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత మంత్రి బన్నా గుప్తా పోటీ చేస్తుండగా, ఆయనపై జేడీయూ అభ్యర్థి సరయి రాయ్ పోటీలో ఉన్నారు. జగన్నాథ్‌పూర్‌లో మాజీ ముఖ్యంత్రి మధుకోడా భార్య గీతా కోడా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సోనా రామ్ సింకు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. రాంచీలో సిట్టింగ్ రాజ్యసభ ఎంపీ మహువా మాజీ పోటీ చేస్తున్నారు. జార్ఖాండ్ అసెంబ్లీ గడువు 2025 జనవరి 5న ముగియాల్సి ఉంది. కాగా, జర్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ 38 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవంబర్ 20న జరుగుతుంది. దీంతో రెండు విడతల పోలింగ్ ముగుస్తుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

PM Modi: కాంగ్రెస్ ఎప్పటికీ ఆ తరగతులను ఎదగనీయదు

Jharkhand: భూములను ఆక్రమిస్తున్న వక్ఫ్ బోర్డుకు ముకుతాడు: అమిత్‌షా

For National news And Telugu Newsఇవి కూడా చదవండి..

Updated Date - Nov 12 , 2024 | 07:12 PM