Jharkhand: అమిత్ షాపై ఆరోపణల కేసు.. జార్ఖండ్ హైకోర్టులో రాహుల్‌కి ఎదురుదెబ్బ
ABN , Publish Date - Feb 23 , 2024 | 07:24 PM
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను(Amith Shah) ఓ హత్య కేసులో నిందితుడిగా ఆరోపిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం విదితమే.
రాంచీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను(Amith Shah) ఓ హత్య కేసులో నిందితుడిగా ఆరోపిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం విదితమే. ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జార్ఖండ్‌లో కేసు నమోదు కాగా.. దాన్ని కొట్టివేయాలంటూ రాహుల్ అక్కడి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై విచారించిన జార్ఖండ్ హైకోర్టు ఇవాళ కీలక తీర్పునిచ్చింది. రాహుల్ అభ్యర్థనను తిరస్కరిస్తూ నిర్ణయం వెలువరించింది. 2018 మార్చి 18న జరిగిన ఏఐసీసీ ప్లీనరీలో రాహుల్ గాంధీ బీజేపీకి వ్యతిరేకంగా ప్రసంగించారని, అమిత్ షాను హత్యా నిందితుడిగా అభివర్ణించారని ఆరోపిస్తూ బీజేపీ నేత నవీన్ ఝా రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు.
లోయర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... తరువాత దాన్ని జార్ఖండ్ హైకోర్టుకు తరలించారు. ఈ ఘటనలో రాహుల్‌పై డిఫమేషన్ కేసు నమోదు చేశారు. జస్టిస్ అంబుజనాథ్ ఈ కేసును విచారించగా.. రాహుల్ తరఫున న్యాయవాది పీయూష్ చిత్రేష్, దీపాంకర్ రాయ్‌లు వాదించారు. ఫిబ్రవరి 16న రాహుల్ రాసిన లేఖను కోర్టులో సమర్పించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి