యడియూరప్ప, శ్రీరాములుపై న్యాయ విచారణ!
ABN , Publish Date - Nov 10 , 2024 | 03:41 AM
కొవిడ్ సమయంలో అవినీతి జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై నాటి సీఎం యడియూరప్ప, అప్పటి మంత్రి బి.శ్రీరాములును న్యాయవిచారణ చేయాలని జస్టిస్ కున్హా కమిటీ సిఫార్సు చేసింది.
బెంగళూరు, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): కొవిడ్ సమయంలో అవినీతి జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై నాటి సీఎం యడియూరప్ప, అప్పటి మంత్రి బి.శ్రీరాములును న్యాయవిచారణ చేయాలని జస్టిస్ కున్హా కమిటీ సిఫార్సు చేసింది. కొవిడ్ సమయంలో నాటి బీజేపీ ప్రభుత్వం కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తునకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాన్ మైఖేల్ కున్హా కమిటీని ఏడాదిన్న క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జస్టిస్ కున్హా కమిటీ మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి ఆగస్టు 31న సమర్పించింది. పీపీఈ కిట్‌ల కొనుగోళ్లలో రూ.14 కోట్ల అవినీతి జరిగిందని పేర్కొంటూ, అప్పటి సీఎం యడియూరప్ప, ఆరోగ్యశాఖ మంత్రి బి.శ్రీరాములును న్యాయవిచారణ చేయాలని సిఫారసు చేసింది.