Share News

Justice Sanjiv Khanna: 51వ సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ప్రమాణస్వీకారం ఎప్పుడంటే

ABN , Publish Date - Nov 10 , 2024 | 09:38 PM

డీవీ చంద్రచూడ్ అక్టోబర్ 16న చేసిన సిఫారసు మేరకు కొత్త సీజేఐగా జస్టిస్ ఖన్నా నియామకాన్ని అక్టోబర్ 24న కేంద్రం అధికారికంగా నోటిఫై చేసింది. గత శుక్రవారంనాడు చివరి పనిదినం పూర్తిచేసిన సీజేఐకు ఘనంగా జడ్జిలు, సిబ్బంది ఫేర్‌వెల్ ఇచ్చారు.

Justice Sanjiv Khanna: 51వ సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ప్రమాణస్వీకారం ఎప్పుడంటే

న్యూఢిల్లీ: భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తి (CJI)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా (Sanjiv Khanna) బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆదివారంనాడు పదవీ విరణణ చేసిన సీజేఐ డీవీ చంద్రచూడ్‌ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఎన్నికల బాండ్ స్కీమ్ రద్దు, 370వ అధికరణ రద్దు వంటి పలు చరిత్రాత్మక తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక భూమిక పోషించారు.

Baba Siddique murder: బాబా సిద్ధిఖి హత్యలో కీలక పరిణామం.. షూటర్ శివ అరెస్టు


డీవీ చంద్రచూడ్ అక్టోబర్ 16న చేసిన సిఫారసు మేరకు జస్టిస్ ఖన్నా నియామకాన్ని అక్టోబర్ 24న కేంద్రం అధికారికంగా నోటిఫై చేసింది. గత శుక్రవారంనాడు చివరి పనిదినం పూర్తిచేసిన సీజేఐకు ఘనంగా జడ్జిలు, సిబ్బంది ఫేర్‌వెల్ ఇచ్చారు.


కాగా, కొత్తగా సీజేఐ బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ ఖన్నా ఢిల్లీలోని ప్రముఖ కుటుంబానికి చెందిన వారు. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి దేవరాజ్ ఖన్నా కుమారుడు. 1960 మే 14న జన్మించిన జస్టిస్ ఖన్నా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్యను అభ్యరించారు. 1983లో ఢిల్లీ బార్‌కాన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 2004లో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జిగా, 2005లో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. కాగా, జస్టిస్ ఖన్నా సీజేఐగా బాధ్యతలు చేపట్టిన అనంతరం 2025 మే 13 వరకూ ఆ పదవిలో కొనసాగుతారు.


ప్రముఖ నటుడు కన్నుమూత.. సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం

సారీ నాన్నా అమ్మను చంపేశా

యడియూరప్ప, శ్రీరాములుపై న్యాయ విచారణ!

For More National And Telugu News

Updated Date - Nov 10 , 2024 | 09:38 PM