Share News

Kailash Gehlot: బీజేపీలో చేరిన కైలాష్ గెహ్లాట్

ABN , Publish Date - Nov 18 , 2024 | 02:41 PM

బీజేపీలో చేరిన అనంతరం గెహ్లాట్ మాట్లాడుతూ, ఎవరి ఒత్తిళ్లతోనో రాత్రికి రాత్రి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు కొందరి భావనగా ఉందని, వారికి నేను చెప్పదలచుకున్నది ఒక్కటేనని, ఏనాడూ తాను ఒత్తిళ్లకు లొంగి నిర్ణయాలు తీసుకున్నది లేదని అన్నారు.

Kailash Gehlot: బీజేపీలో చేరిన కైలాష్ గెహ్లాట్

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి రాజీనామా చేసిన ఢిల్లీ రవాణా శాఖ మాజీ మంత్రి కైలాష్ గెహ్లాట్ (Kailash Gahlot) భారతీయ జనతా పార్టీ (BJP)లో సోమవారంనాడు చేరారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖత్తార్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.

Narendra Modi: నేటి నుంచి 19వ G20 సదస్సు.. బ్రెజిల్ చేరుకున్న ప్రధాని మోదీ


రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకులేదు, ఒత్తిళ్లూ లేవు..

బీజేపీలో చేరిన అనంతరం గెహ్లాట్ మాట్లాడుతూ, ఎవరి ఒత్తిళ్లతోనో రాత్రికి రాత్రి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు కొందరి భావనగా ఉందని, వారికి నేను చెప్పదలచుకున్నది ఒక్కటేనని, ఏనాడూ తాను ఒత్తిళ్లకు లొంగి నిర్ణయాలు తీసుకున్నది లేదని అన్నారు. ఈడీ, సీబీఐ ఒత్తిళ్లతోనే ఈ పరిణామం చోటుచేసుకుందని కొందరు తప్పుగా విశ్లేషిస్తున్నారని చెప్పారు.


మోదీ విజన్ నచ్చే..

''ఆరోజు అందరూ ఒకతాటిపైకి ఎందుకు వచ్చామో అది ఈనాడు కనిపించడం లేదు. ఒక ప్రభుత్వం ప్రతి అంశం మీద కేంద్రంతో గొడవపడుతుంటే ఢిల్లీ అభివృద్ధి అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని నేను బలంగా నమ్ముతున్నాను. ఆ కారణంగానే నేను బీజేపీలో చేరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజన్, విధానల స్ఫూర్తితో పనిచేస్తాను'' అని కైలాష్ గెహ్లాట్ తెలిపారు.


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరగాల్సిన తరుణంలో 'ఆమ్ ఆద్మీ పార్టీ'కి గెహ్లాట్ ఆదివారంనాడు రాజీనామా చేయడం సంచలనమైంది. కేంద్రంతో 'ఆప్' ప్రభుత్వ నిరంతర ఘర్షణ, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవడం, శీష్‌మహల్ వివాదం, యమునా నది ప్రక్షాళ హామీకు తూట్లు పొడవడం వంటి అంశాలను కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో గెహ్లాట్ ప్రస్తావించారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఇంకా నమ్మాల్సిన అవసరం ఉందా అనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలోనూ ఉందని తప్పుపట్టారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు బదులు రాజకీయ ఆకాంక్షలకే ఆప్ పరిమితమైనందున తాను గత్యంతరం లేకనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, గెహ్లాట్ రాజీనామాపై బీజేపీని ఆప్ తప్పుపట్టింది. కేంద్ర ఏజెన్సీలను ఉసిగొలిపి ఒత్తిడి రాజకీయాలకు పాల్పడిందని ఆరోపించింది.


ఇవి కూడా చదవండి...

Swara Bhasker: స్వరభాస్కర్.. ఏంటిది? ముస్లిం మత పెద్దను కలిసిన బాలీవుడ్ నటిపై నెటిజన్ల ఆగ్రహం..

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 18 , 2024 | 02:43 PM