Share News

Uttarakhand: 28 నుంచి కైలాస- మానస సరోవర యాత్ర

ABN , Publish Date - Sep 21 , 2024 | 05:06 AM

కైలాస- మానస సరోవర యాత్రికులకు తీపికబురు. ఈ యాత్ర సెప్టెంబరు 28 నుంచి ప్రారంభం కానుంది. కుమావోన్‌ మండల్‌ వికాస్‌ నిగమ్‌(కేఎంబీఎన్‌) అనే సంస్థ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించనుంది.

Uttarakhand: 28 నుంచి కైలాస- మానస సరోవర యాత్ర

  • కరోనా తర్వాత ఇదే మొదటిసారి

పిథోరగఢ్‌, సెప్టెంబరు 20: కైలాస- మానస సరోవర యాత్రికులకు తీపికబురు. ఈ యాత్ర సెప్టెంబరు 28 నుంచి ప్రారంభం కానుంది. కుమావోన్‌ మండల్‌ వికాస్‌ నిగమ్‌(కేఎంబీఎన్‌) అనే సంస్థ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఇది కేంద్ర ప్రభుత్వం, ఉత్తరాఖండ్‌ పర్యాటక అభివృద్ధి బోర్టు ఆధ్వర్యంలో ప్రారంభమైన పైలట్‌ ప్రాజెక్టు. ఈ యాత్రలో పాల్గొనే భక్తులు ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్‌ నుంచి చైనా సరిహద్దుల్లోని లిపు లేఖ్‌ పాస్‌ వరకు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు.


అక్కడి నుంచి కైలాస పర్వతం 97 కి.మీ. పరమ శివుడు నివాసముంటాడని విశ్వసించే చోటు కైలాస పర్వతం. ఈ యాత్ర లిపు సరస్సు గుండా 1981లో మొదలైంది. కరోనా కారణంగా 2020లో నిలిపివేశారు. అయితే ఈ సంవత్సరం కేవలం 60 మందిని మాత్రమే యాత్రకు అనుమతిస్తారు. వీరిని నాలుగు బృందాలుగా విభజిస్తారు. 55 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి.

Updated Date - Sep 21 , 2024 | 05:06 AM