Kamal nath: పార్టీ మార్పు ఊహాగానాలకు తెరదించిన కమల్‌నాథ్
ABN , Publish Date - Feb 27 , 2024 | 02:27 PM
కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బీజేపీలో చేరుతారనే ఊహాగానాలకు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ తెరదించారు. ''నా నోటి నుంచి ఎప్పుడైనా ఆ మాట రావడం మీరు విన్నారా? అలాంటి సంకేతాలు ఏవైనా ఉన్నాయా? అలాంటిదేమీ లేదు. మీరే పార్టీ మారుతున్నానంటూ ప్రచారం చేశారు. ఆ తర్వాత వచ్చి నన్ను అడుగుతున్నారు. మీరే ఆ మాటల్ని ఖండించండి'' అని మీడియాతో మాట్లాడుతూ కమల్‌నాథ్ అన్నారు.
ఛింద్వారా: కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బీజేపీలో చేరుతారనే ఊహాగానాలకు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ (Kamalnath) తెరదించారు. ''నా నోటి నుంచి ఎప్పుడైనా ఆ మాట రావడం మీరు విన్నారా? అలాంటి సంకేతాలు ఏవైనా ఉన్నాయా? అలాంటిదేమీ లేదు. మీరే పార్టీ మారుతున్నానంటూ ప్రచారం చేశారు. ఆ తర్వాత వచ్చి నన్ను అడుగుతున్నారు. మీరే ఆ మాటల్ని ఖండించండి'' అని మీడియాతో మాట్లాడుతూ కమల్‌నాథ్ అన్నారు. ఛింద్వారా జిల్లాలో ఐదు రోజుల పర్యటన కోసం ఆయన ఇక్కడకు వచ్చారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ కార్యకర్తలు, అధికారులతో ఆయన సమావేశం కానున్నారు.
రాష్ట్రంలో వర్షాలు, వడగండ్లతో పంటల దెబ్బతిన్న రైతులకు మఖ్యమంత్రి నుంచి తగిన పరిహారం ఇవ్వాలని కమల్‌నాథ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రుణాల్లో కూరుకుపోయిందని, అప్పుల మీదే రాష్ట్రం నడుస్తోందని ఆక్షేపించారు. లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటనపై అడిగినప్పుడు, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని ఆయన చెప్పారు.