Actor Darshan: జైలులో వీఐపీ ట్రీట్‌మెంట్ వివాదం.. బళ్లారి జైలుకు దర్శన్ తరలింపు
ABN , Publish Date - Aug 27 , 2024 | 09:06 PM
వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారంటూ వివాదం రేగిన నేపథ్యంలో ఆయనను బళ్లారి జైలుకు తరలిస్తున్నారు. పరప్పన అగ్రహార కేంద్ర కారాలయంలో ఉన్న దర్శన్‌ను బెంగళూరు న్యాయస్థానం ఆదేశాల మేరకు బళ్లారి జైలుకు మారుస్తున్నారు.
బెంగళూరు: వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కన్నడ నటుడు దర్శన్ (Darshan)కు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారంటూ వివాదం రేగిన నేపథ్యంలో ఆయనను బళ్లారి జైలుకు తరలిస్తున్నారు. పరప్పన అగ్రహార కేంద్ర కారాలయంలో ఉన్న దర్శన్‌ను బెంగళూరు న్యాయస్థానం ఆదేశాల మేరకు బళ్లారి జైలుకు మారుస్తున్నారు.
జైలు బ్యారక్ నుంచి దర్శన్ బయటకు వచ్చి స్నేహితులతో కూర్చొని కాఫీ, సిగరెట్ తాగుతూ నవ్వుతూ ముచ్చటిస్తున్న ఫోటో ఒకటి బయటకు రావడంతో ఈ వ్యవహారం వైరల్ అయింది. దర్శన్‌తో పాటు ఇదే జైలులో ఉన్న రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాగ కూడా ఫోటోలో ఉన్నారు. జైలు నుంచి దర్శన్ వీడియో కాల్‌లో ముచ్చటిస్తున్న వీడియో కూడా బయటకు రావడంతో ఉన్నతాధికారులు చర్యలకు దిగారు. జైల్ చీఫ్ సూపరింటెండెంట్‌తో సహా తొమ్మిది మంది జైలు అధికారులను బదిలీ సస్పెండ్ చేశారు.
Jharkhand: చంపయి సోరెన్ బీజేపీలోకి రావడంపై మాజీ సీఎం గుస్సా
జైలు ఘటనకు సంబధించి మూడు వేర్వేరు కేసులు నమోదు చేసి ప్రిజన్ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) కింద విచారణ జరుపుతున్నట్టు పోలీస్ కమిషనర్ బి.దయానంద మీడియాకు తెలిపారు. ఇటీవల సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ జరిపిన ఇన్‌స్పెక్షన్‌లో ఎలాంటి అనుమానిత సాక్ష్యాలు లభించలేదని, అయితే ఇన్‌స్పెక్షన్ టీమ్ రావడానికి ముందే కొన్ని వస్తువులను అక్కడ్నించి తరిలించి ఉండవచ్చని చెప్పారు. కాగా, జైలులో దర్శన్‌కు సంబంధించిన దృశ్యాలు వెలుగుచూడటంతో ఈ కేసులో నిందితులను కూడా కర్ణాటకలోని ఇతర జైళ్లకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది.
Read More National News and Latest Telugu News