Share News

Kanpur Train Accident: పేలుళ్లకు కుట్ర.. రైలు బోల్తా కొట్టేందుకు గ్యాస్ సిలిండర్‌తో ప్లాన్

ABN , Publish Date - Sep 09 , 2024 | 10:34 AM

ఆదివారం అర్థరాత్రి ఉత్తర్ ప్రదేశ్‌(uttar pradesh)లోని కాళింది ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలును బోల్తా కొట్టించేందుకు పెద్ద కుట్ర చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి ప్రయాగ్‌రాజ్ నుంచి భివానీకి వెళ్తున్న కాళింది ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ బిల్హౌర్ రైల్వే స్టేషన్‌కు కొంత దూరంలో ట్రాక్‌పై ఎల్‌పీజీ సిలిండర్ పెట్టారు. అయితే ఆ తర్వాత ఏమందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Kanpur Train Accident: పేలుళ్లకు కుట్ర.. రైలు బోల్తా కొట్టేందుకు గ్యాస్ సిలిండర్‌తో ప్లాన్
Kanpur Train Accident

ఆదివారం అర్థరాత్రి ఉత్తర్ ప్రదేశ్‌(uttar pradesh)లోని కాళింది ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలును బోల్తా కొట్టించేందుకు పెద్ద కుట్ర చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆదివారం రాత్రి ప్రయాగ్‌రాజ్ నుంచి భివానీకి వెళ్తున్న కాళింది ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ బిల్హౌర్ రైల్వే స్టేషన్‌కు కొంత దూరంలో ట్రాక్‌పై ఎల్‌పీజీ సిలిండర్ ఉండటాన్ని గమనించాడు. ఆ క్రమంలో సిలిండర్‌ను చూసిన లోకో పైలట్‌ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో రైలు సిలిండర్‌ను ఢీకొని కొద్దిదూరంలో ఆగిపోయింది.

ఆ తర్వాత లోకో పైలట్ రైలును ఆపి ఆర్పీఎఫ్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో సిలిండర్‌తో పాటు పెట్రోల్‌ నింపిన బాటిల్‌, అగ్గిపుల్ల, బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.


డ్రైవర్ అప్రమత్తంతో

అయితే సిలిండర్ ఇంజన్‌లో ఇరుక్కుని పేలకుండా ఉండిపోయిందని అధికారులు అన్నారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని వెల్లడించారు. అలాగే అకస్మాత్తుగా అత్యవసర బ్రేక్‌లు వేయడం వల్ల రైలు పట్టాలు కూడా తప్పే ప్రమాదం ఉందన్నారు. దీని తర్వాత అన్వర్‌గంజ్-కాస్‌గంజ్ రైల్వే ట్రాక్‌పై కాళింది ఎక్స్‌ప్రెస్ 22 నిమిషాల పాటు నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ కేసును ఛేదించేందుకు ఫోరెన్సిక్ బృందాన్ని కూడా పిలిపించారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కూడా దీనిపై దర్యాప్తు చేస్తోంది. ఘటనా స్థలానికి సమీపంలో పాడైన సిలిండర్‌తో పాటు పెట్రోల్‌ నింపిన బాటిల్‌, అగ్గిపుల్లలు సహా పలు అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.


రైళ్ల నిలిపివేత

అసలు రైలును బోల్తా కొట్టించేందుకు ట్రాక్‌లపై గ్యాస్ సిలిండర్లు పెట్టారా లేదా పేల్చేందుకు పెట్టారా అనేది తెలియాల్సి ఉంది. ట్రాక్ సమీపంలో ఇతర అభ్యంతరకర పదార్థాలను ఉంచారని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో వాటిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు. ఈ విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. కాన్పూర్‌లోని ముదేరి గ్రామ సమీపంలోని 43సి క్రాసింగ్ సమీపంలో ఈ ఘటన జరిగింది.

ట్రాక్‌పై

ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించిన రైల్వేశాఖ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ప్రాథమిక విచారణలో ట్రాక్‌పై ఇనుము లాంటి వస్తువును రుద్దిన గుర్తులు కనుగొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా బిల్హౌర్ స్టేషన్‌లో రైలును కూడా కొంతసేపు నిలిపివేశారు. దీంతోపాటు లక్నో నుంచి బాంద్రా టెర్మినల్‌కు వెళ్లే లక్నో బాంద్రా ఎక్స్‌ప్రెస్‌ను కూడా బిల్హౌర్ స్టేషన్‌లో ఆపేశారు.


ఇవి కూడా చదవండి:

Rahul Gandhi: నిరుద్యోగ సమస్యపై అమెరికాలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

Viral Video: గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్

Money Saving Plan: రిటైర్‌ మెంట్ వరకు రూ. 8 కోట్లు కావాలంటే.. నెలకు ఎంత సేవ్ చేయాలి..


Money Saving Tips: రోజు రూ.250 సేవ్ చేయండి.. ఇలా రూ.2 కోట్లు సంపాదించండి..


Read MoreNational News and Latest Telugu News

Updated Date - Sep 09 , 2024 | 11:00 AM