Share News

POCSO Case: తక్షణ అరెస్టుపై మాజీ సీఎంకు హైకోర్టు ఊరట

ABN , Publish Date - Jun 14 , 2024 | 09:03 PM

లైంగిక వేధింపుల ఆరోపణలపై నమోదైన పోక్సో కేసులో బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ జరిగే జూన్ 17వ తేదీ వరకూ ఆయనను అరెస్టు చేయరాదని కర్ణాటక హైకోర్టు శుక్రవారంనాడు ఆదేశించింది.

POCSO Case: తక్షణ అరెస్టుపై మాజీ సీఎంకు హైకోర్టు ఊరట

బెంగళూరు: లైంగిక వేధింపుల ఆరోపణలపై నమోదైన పోక్సో (POSCO) కేసులో బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప (BS Yediyurappa)కు ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ జరిగే జూన్ 17వ తేదీ వరకూ ఆయనను అరెస్టు చేయరాదని కర్ణాటక హైకోర్టు (Karnataka High court) శుక్రవారంనాడు ఆదేశించింది.


ప్రత్యేక దర్యాప్తు బృందం (సీఐడీ) చేపడుతున్న విచరణకు సంబంధించిన ఫిర్యాదును కొట్టివేయాలని ఇటీవల హైకోర్టును యడియూరప్ప అశ్రయించారు. దీనిపై విచారణ సందర్భంగా తన క్లయింట్ ఈనెల 17న సీఐడీ ముందు హాజరవుతారని హైకోర్టుకు యడియూరప్ప తరఫు న్యాయవాది సందీప్ సి పాటిల్ తెలిపారు. ఇందుకు కోర్టు అంగీకరించింది. యడియూరప్ప మాజీ ముఖ్యమంత్రి కావడం, ఆయన వయస్సును దృష్టిలో ఉంచుకుని దర్యాప్తు సంస్థ కోర్టుకు వెళ్లడం కానీ, అరెస్టు వారెంటు తెచ్చుకోవాల్సిన అవసరం కానీ లేదని కోర్టు అభిప్రాయపడినట్టు మీడియాతో మాట్లాడుతూ యడియూరప్ప న్యాయవాది తెలిపారు. మైనర్ బాలికలపై లైంగిక దాడి ఆరోపణల కేసులో యడియూరప్పపై బెంగళూరు కోర్టు ఇటీవల నాన్ ‌బెయిలబుల్ వారెంటు జారీ చేసిన నేపథ్యంలో హైకోర్టు తాజా ఆదేశాలు ఇచ్చింది. 17న సీఐడీ ముందు యడియూరప్ప హాజరవుతున్నందున అంతవరకూ అరెస్టు చేయవద్దని స్పష్టం చేసింది.

Raaj kumar Anand: అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోయిన ఢిల్లీ మాజీ మంత్రి


తన కుమార్తెపై యడియూరప్ప లైంగిక దాడి చేసినట్టు బాలిక తల్లి గత మార్చిలో బెంగళూరు సదాశివనగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి సోదరుడు యడియూరప్పపై కోర్టులో పిటిషన్ వేశారు. బెంగళూరు కోర్టు వారెంట్ నేపథ్యంలో యడియూరప్ప ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్టు తెలుస్తోంది.

For More National News and Telugu News..

Updated Date - Jun 14 , 2024 | 09:29 PM