Share News

karnataka politics: ప్రజ్వల్‌పై సస్పెన్షన్ వేటు

ABN , Publish Date - Apr 30 , 2024 | 01:24 PM

కర్ణాటక రాజకీయాలను జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలల వీడియోలు కుదిపేస్తున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జేడీ(ఎస్) మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజ్వల్ రేవణ్ణపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే హాసన్ లోక్‌సభ స్థానం నుంచి మళ్లీ ప్రజ్వల్ జేడీ(ఎస్) అభ్యర్థిగా బరిలో దిగారు.

karnataka politics: ప్రజ్వల్‌పై సస్పెన్షన్ వేటు
Prajwal Revanna

బెంగళూరు, ఏప్రిల్ 29: కర్ణాటక రాజకీయాలను జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) రాసలీలల వీడియోలు కుదిపేస్తున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జేడీ(ఎస్) మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజ్వల్ రేవణ్ణపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే హాసన్ లోక్‌సభ స్థానం నుంచి మళ్లీ ప్రజ్వల్ జేడీ(ఎస్) అభ్యర్థిగా బరిలో దిగారు. అతడికి షోకాజ్ నోటీసు సైతం పార్టీ జారీ చేసింది. అయితే అతడు ప్రాతినిద్యం వహిస్తున్న హాసన్ నియోజకవర్గంలో ఆ వీడియోలు వైరల్ అవుతున్న సమయంలోనే.. అంటే శనివారం ఉదయం ప్రజ్వల్ జర్మనీకి పయనమైయ్యారు.

Loksabha polls 2024: కేసీఆర్.. స్థాయిని మరిచి అబద్దాలు మాట్లాడుతున్నారన్న భట్టి


మరోవైపు ఈ వీడియోలు వైరల్ అవుతున్న తరుణంలోనే ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. 2019-2022 మధ్య ప్రజ్వల్ రేవణ్ణ పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే తన కుమార్తెకు అతడు వాట్సప్ వీడియో కాల్ చేసి అసభ్యంగా మాట్లాడాడని ఆ ఫిర్యాదులో స్పష్టం చేసింది.

ఇక ప్రజ్వల్ తండ్రి హెచ్ డి రేవణ్ణపై ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హోలెనర్సిపూర్ నియోజకవర్గంలో ఇవే తరహా ఆరోపణలతో పోలీస్ కేసు నమోదు అయింది. ఆయన నివాసంలో గతంలో పని చేసిన మహిళే.. ఈ ఆరోపణలు చేసింది. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ కుమారుడే ఈ ప్రజ్వల్ రేవణ్ణ.

Amit Shah: రేవణ్ణ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు.. అమిత్ షా సూటిప్రశ్న


ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీ(ఎస్) కలిసి పోటీ చేస్తున్నాయి. దీంతో ఈ అంశంపై నిన్నటి వరకు జేడీ(ఎస్) ఆచి తూచి స్పందించింది. కానీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడేక్కడంతో.. జేడీ(ఎస్) ప్రజ్వల్‌పై వేటు వేయక తప్పలేదు.

PM Modi: జహీరాబాద్‌లో నేడు ప్రధాని మోదీ ప్రచారం

Read latest National News And Telugu News

Updated Date - Apr 30 , 2024 | 01:30 PM