Share News

Karti Chidambaram: వారానికి 4 రోజుల పని చాలు.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తితో విభేదించిన ఎంపీ

ABN , Publish Date - Dec 23 , 2024 | 03:06 PM

దేశం పురోగతి చెందాలంటే ఎక్కువ గంటలు పనిచేయాలనడం అర్ధరహితమని, దీనికి బదులుగా సమర్ధతపై దృష్టి పెట్టాలని కార్తీ చిదంబరం సూచించారు.

Karti Chidambaram: వారానికి 4 రోజుల పని చాలు.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తితో విభేదించిన ఎంపీ

న్యూఢిల్లీ: దేశ ప్రగతి కోసం యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ (Infosis) సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy) చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం (Karti Chidambaram) తోసిపుచ్చారు. దేశం పురోగతి చెందాలంటే ఎక్కువ గంటలు పనిచేయాలనడం అర్ధరహితమని, దీనికి బదులుగా సమర్ధతపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇందువల్ల వ్యక్తిగత శ్రేయస్సు, దేశ వృద్ధి సాధ్యమవుతాయని అన్నారు.

Narayana Murthy: వాతావరణ మార్పులతో హైదరాబాద్‌కు వలసలు పెరుగుతాయ్: ఇన్ఫీ నారాయణ మూర్తి


ఎక్కువ పని గంటల విధానాన్ని గత కొంతకాలంగా నారాయణమూర్తి సమర్ధిస్తున్నారు. 6 రోజుల పని దినాలను 5 రోజులకు తగ్గించడంపై ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశాభివృద్ధికి త్యాగాలు, కఠోర పరిశ్రమ అవసరమన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారానికి 100 గంటలు పనిచేస్తారని, దేశ ప్రజలు అలాంటి అంకితభావంతో పనిచేస్తే అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరుతుందని చెప్పారు.


నారాయణ మూర్తి వాదనతో కార్తి చిదంబరం విభేదిస్తూ సోషల్ మీడియా "ఎక్స్"లో ట్వీట్ చేశారు. నాసిరకం మౌలిక సదుపాలతో రోజువారీ జీవితం ఒక పోరాటంలో సాగుతున్నప్పుడు సుదీర్ఘంగా పనిచేయడమనేది అర్థరహితమని, దానికి బదులుగా సమర్ధతపై దృష్టిపెట్టాలని సూచించారు. వర్కర్ల వ్యక్తిగత శ్రేయసు కోసం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండటం ముఖ్యమని అన్నారు. ఇందుకోసం వారానికి నాలుగు రోజుల పని విధానానికి మనం మారాలని, సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకూ పని వాధానం ఉండాలని సూచించారు.


వర్క్‌లైఫ్ బ్యాలెన్స్‌పై నారాయణమూర్తి వాదనను కాంగ్రెస్ పార్టీ నేత గౌరవ్ గొగోయ్ సైతం ఇటీవల విమర్శించారు. జీవితం అంటే పని ఒక్కటే కాదని, కుటుంబ పోషణ, వ్యక్తిగత సంబంధాలు కూడా ఉంటాయన్నారు. పిల్లల బాగోగులు చూడటం, వారికి తిండిపెట్టడం, చదువునేర్పడం, కుటుంబంలోని పెద్దల క్షేమం చూసుకోవడం, ఆపదల్లో ఉన్న మిత్రులను ఆదుకోవడం వంటివన్నీ జీవితంలో భాగమేనని అన్నారు.


ఇది కూడా చదవండి..

National : యూపీలో భారీ ఎన్‌కౌంటర్.. హతమైన ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు..

National Farmers Day: నేడు జాతీయ రైతు దినోత్సవం.. దీని చరిత్ర గురించి తెలుసా..

For National News And Telugu News

Updated Date - Dec 23 , 2024 | 03:06 PM