Kashi Viswanath Dham: కాశీ విశ్వనాథ దేవాలయంలోకి క్యూఆర్ కోడ్‌తో ఎంట్రీ
ABN , Publish Date - Jul 15 , 2024 | 02:53 PM
ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించే యాత్రికులకు మరింత సులభంగా ఆలయ ప్రవేశానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా క్యూఆర్ కోడ్ ఆధారిత గుర్తింపు కార్డుతో ఆలయం ఆవరణలోకి ప్రవేశం కల్పించనున్నారు.
వారణాసి: ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయాన్ని (Kashi Viswanath Dham) దర్శించే యాత్రికులకు మరింత సులభంగా ఆలయ ప్రవేశానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా క్యూఆర్ (QR) కోడ్ ఆధారిత గుర్తింపు కార్డుతో ఆలయం ఆవరణలోకి ప్రవేశం కల్పించనున్నారు. వీఐపీ దర్శనం, ప్రొటోకాల్ దర్శనం కోసం వచ్చేవారికే ఈ పద్ధతిలో ఎంట్రీ కల్పించనున్నారు. గత మార్చి నుంచి అధికారులు, ఉద్యోగులకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పించగా ఇప్పుడు సాధారణ యాత్రికులకు కూడా ఈ అవకాశాన్ని విస్తరిస్తున్నారు.
Temple: జమ్మూలో 30 ఏళ్ల తరువాత తెరుచుకున్న ఆలయం.. ముస్లింల హర్షం
థామ్ వద్ద సౌకర్యాలను మెరుగుపరచడంలో భాగంగా పూర్తి స్థాయి డిజిటల్ సర్వీసులను అందించేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నాయి. క్యూఆర్ కోడ్ ఆధారిత ఆర్ఎఫ్ఐడీ (రేడియా ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) ద్వారా యాత్రికుల ప్రవేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఆర్ఎఫ్ఐడీ మెషీన్‌ను ఆలయం వద్ద ఇప్పటికే ఏర్పాటు చేశారు. శ్రీ కాశీ విశ్వనాథుని లోగోతో ఉండే ఈ ఐడెంటిఫికేషన్ కార్డును ఆలయ యంత్రాగం జారీ చేస్తుంది. యాత్రికులు ఐడీ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కానింగ్ చేసుకుని థామ్‌లోకి ప్రవేసించవచ్చు. కార్డు స్కాన్ కాగానే ప్రవేశద్వారాలు ఆటోమాటిక్‌గా తెరుచుకుంటాయి. ఈ ప్రక్రియ ప్రారంభం కాగానే ఆలయాన్ని దర్శించే ప్రతి ఒక్కరి రికార్డులను భద్రం చేసే పని ఆలయ అధికారులు తేలికవుతుంది. ఆర్ఎఫ్ఐడీ మెషీన్లను ప్రవేశద్వారం, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ఏర్పాటు చేస్తుండగా, ఈ మెషీన్లు క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి భక్తుల రాకపోకలకు వీలుకల్పిస్తాయి. 15 మీటర్ల దూరం నుంచి మెషీన్లు ఆర్‌ఎఫ్ఐడీ కార్డ్‌ను రీడ్ చేస్తాయి. కార్డులో ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం, యాత్రికుల పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ ఉంటాయి. రెగ్యులర్ యాత్రికులు ఏ గేటు నుంచైనా థామ్‌లోకి అడుగుపెట్టవచ్చు. అయినప్పటికీ కాశీ ప్రయాణికుల కోసం కాశీ గేట్‌ను నిర్మించారు.
For Latest News and National News click here