Arvind Kejriwal: ఆటోడ్రైవర్లకు రూ.10 లక్షల బీమా, పిల్లల పెళ్లిళ్లకు లక్ష సాయం
ABN , Publish Date - Dec 10 , 2024 | 03:57 PM
ఆటోవాలాలకు రూ.10 లక్షల బీమా, పిల్లల పెళ్లిళ్లకు రూ.1 లక్ష సాయం అందిస్తామని కేజ్రీవాల్ వాగ్దానం చేశారు. ఆటో డ్రైవర్ నవ్‌నీత్ ఇంట్లో కేజ్రీవాల్, ఆయన భార్య నవనీత్ మంగళవారంనాడు లంచ్ తీసుకున్నారు.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఆటో డ్రైవర్ల (Auto Drivers)పై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వరాల జల్లులు కురిపించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆటోవాలాలకు 5 కీలక హామీలిచ్చారు. ఆటోవాలాలకు రూ.10 లక్షల బీమా, పిల్లల పెళ్లిళ్లకు రూ.1 లక్ష సాయం అందిస్తామని వాగ్దానం చేశారు. ఆటో డ్రైవర్ నవ్‌నీత్ ఇంట్లో కేజ్రీవాల్, ఆయన భార్య సునీత మంగళవారంనాడు లంచ్ తీసుకున్నారు.
Jagdeep Dhankar: రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు
''నిన్న మా ఇంట్లో ఆటోడ్రైవర్లతో సమావేశమయ్యాను. ఈరోజు నవ్‌నీత్ (ఆటోడ్రైవర్) ఇంటికి మధ్యాహ్నం భోజనం కోసం వచ్చాను. ఆటోడ్రైవర్లకు ఐదు హామీలు ఇస్తున్నాను. 2025 ఫిబ్రవరిలో మేము మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. ఇచ్చిన 5 హామీలను ఆ వెంటనే అమలు చేస్తాం. ఆటోడ్రైవర్ కుమార్తెల పెళ్లిళ్లకు లక్ష రూపాయలు సాయం అందిస్తాం. దీపావళి, హోలి పండుగలకు యూనిఫాం కోసం రూ.2,500 చొప్పున ఇస్తాం. రూ.10 లక్షల జీవిత బీమా, రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తాం. ఆటోడ్రైవర్ల పిల్లలకు ఫ్రీ కోచింగ్ సదుపాయం కల్పిస్తాం. 'PoochO' app తిరిగి ప్రారంభిస్తాం'' అని కేజ్రీవాల్ ఈ సందర్భంగా ప్రకటించారు.
ఫిబ్రవరిలో ఎన్నికలు
కాగా, 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీకి 2025 ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగనున్నాయి. ఆప్‌తో పాటు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికల బరిలో ఉన్నాయి. 2020లో 70 స్థానాలకు గాను 62 సీట్లు ఆప్ గెలుచుకుంది. వరుసగా మూడోసారి కూడా అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉంది.
ఇవి కూడా చదవండి..
INDIA Block: మమతకు మద్దతు తెలిపిన మాజీ సీఎం
CM Stalin: సీఎం స్టాలిన్ సంచలన కామెంట్స్.. ఆ ప్రాజెక్టు అమలైతే పదవికి రాజీనామా..
For National News And Telugu News