CM Kejriwal: ఢిల్లీలో ప్రతి మహిళకు రూ.1000 ప్రకటించిన కేజ్రీవాల్..
ABN , Publish Date - Mar 04 , 2024 | 01:26 PM
సీఎం అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మహిళలందరినీ తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు అదిరిపోయే స్కెచ్ వేసింది. ఈ క్రమంలోనే ఇవాళ ఢిల్లీలో ప్రతి మహిళకు రూ.1000 ప్రకటించింది. అసెంబ్లీలో నేడు బడ్జెట్‌ను కేజ్రీవాల్ సర్కార్ ప్రవేశ పెట్టింది. ఈ నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మహిళా ఓట్ల కోసం తాయిలాన్ని ప్రకటించింది.
ఢిల్లీ: సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) సర్కార్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మహిళలందరినీ తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు అదిరిపోయే స్కెచ్ వేసింది. ఈ క్రమంలోనే ఇవాళ ఢిల్లీ (Delhi)లో ప్రతి మహిళకు రూ.1000 ప్రకటించింది. అసెంబ్లీలో నేడు బడ్జెట్ (Budget)ను కేజ్రీవాల్ సర్కార్ ప్రవేశ పెట్టింది. ఈ నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మహిళా ఓట్ల కోసం తాయిలాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు రూ.1,000 ఇస్తామని అసెంబ్లీలో ఆప్ ప్రభుత్వం (AAP Government) ప్రకటన చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.