Kejriwal : మనోధైర్యం 100 రెట్లు
ABN , Publish Date - Sep 14 , 2024 | 03:51 AM
కేజ్రీవాల్ తీహాడ్ జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యారు. అనంతరం జైలు దగ్గర తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ఆప్ కార్యకర్తలను ఉద్దేశించి ఓ వాహనం పై నుంచి మాట్లాడుతూ... జైలు గోడలు తన మనోధైర్యాన్ని దెబ్బతీయలేవని, జైలుకు పంపాక తన మనోధైర్యం 100 రెట్లు పెరిగిందని చెప్పారు.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: కేజ్రీవాల్ తీహాడ్ జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యారు. అనంతరం జైలు దగ్గర తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ఆప్ కార్యకర్తలను ఉద్దేశించి ఓ వాహనం పై నుంచి మాట్లాడుతూ... జైలు గోడలు తన మనోధైర్యాన్ని దెబ్బతీయలేవని, జైలుకు పంపాక తన మనోధైర్యం 100 రెట్లు పెరిగిందని చెప్పారు. దేశాన్ని బలహీన పరచాలని చూస్తున్న జాతి వ్యతిరేక శక్తులపై తన పోరాటం ఆగదన్నారు. ఈ సందర్భంగా ఇంక్విలాబ్ జిందాబాద్, వందే మాతరం... అని కేజ్రీవాల్ నినదించారు. తన విడుదల కోసం ప్రార్థించిన వారికి ధన్యవాదాలు చెప్పారు. వర్షంలోనూ తన కోసం వచ్చిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తన ప్రతి రక్తపు బొట్టు దేశ సేవ కోసమేనన్నారు. తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించానని, అయితే దేవుడు ఆ కష్ట సమయాల్లో తనకు మద్దతుగా ఉన్నాడని.. తాను నిజాయితీపరుడిని కనుక ఇప్పుడూ తన వెంటే నిలిచాడని చెప్పారు. పంజాబ్ సీఎం భగ్వంత్ మాన్, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా, వందలాది మంది ఆప్ కార్యకర్తలు కేజ్రీవాల్‌కు స్వాగతం పలికారు.