Kerala : భర్త సీఎస్‌గా రిటైరయిన వెంటనే భార్యకు ఆ స్థానం
ABN , Publish Date - Aug 23 , 2024 | 04:10 AM
కేరళ అధికార వర్గాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. చరిత్రలో ఆసక్తికరమైన సందర్భం ఆసన్నమవుతోందని చెప్పుకొంటున్నారు.
వేణూ శారదం
కేరళలో అరుదైన సందర్భం
తిరువనంతపురం, ఆగస్టు 22: కేరళ అధికార వర్గాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. చరిత్రలో ఆసక్తికరమైన సందర్భం ఆసన్నమవుతోందని చెప్పుకొంటున్నారు. అత్యంత కీలకమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పదవిని భార్యాభర్తలు నిర్వహించనుండడమే ఇందుకు కారణం.
ప్రస్తుత సీఎస్ డాక్టర్ వి. వేణు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆ మరుసటి రోజునే ఆయన భార్య, స్థానిక స్వపరిపాలన శాఖ అదనపు చీఫ్ సెక్రటరీ శారదా మురళీధరన్ సీఎ్‌సగా బాధ్యతలు చేపట్టనున్నారు.
మధ్యలో ఎలాంటి విరామం లేకుండానే ఇద్దరి పాలన కొనసాగనుంది.ఇద్దరూ 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారులే. పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలులో దిట్టగా శారదకు పేరుంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకగా చేపట్టిన ‘కుటుంబశ్రీ మిషన్’ను ఆమె సమర్థంగా అమలు చేశారు. 2013లో కేంద్రంలో డిప్యుటేషన్‌లో ఉన్నప్పుడు కూడా నేషనల్ రూల్ లైవ్లీహుడ్ మిషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా, పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. డాక్టర్ వేణు జన్మస్థలం కేరళలోని కొజికోడ్. అక్కడి కేంద్రీయ విద్యాలయ్‌లో పాఠశాల విద్య, మలబార్ క్రిస్టియన్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు.