Canada arrest: ఖలిస్తాన్ టెర్రరిస్టు అర్ష్ డల్లా కెనడాలో అరెస్టు
ABN , Publish Date - Nov 10 , 2024 | 06:15 PM
కెటీఎఫ్ చీఫ్ హర్దీప్ నిజ్జర్ గత ఏడాది కెనడాలో హత్యకు గురికావడం, ఈ ఘటనలో భారత ఏజెన్సీల ప్రమేయం ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపించడంతో భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. నిజ్జర్‌కు సన్నిహితుడైన డల్లాకు భారతదేశంలో పలు క్రిమినల్ కేసులతో సంబంధాలు ఉన్నాయని ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.
న్యూఢిల్లీ: ఖలిస్థానీ టెర్రరిస్టు, హర్దీప్ సింగ్ నిజ్జర్ సన్నిహితుడు అర్ష్ డల్లా (Arsh Dalla) అలియాస్ అర్ష్‌దీప్ సింగ్ కెనడా (Canada)లో అరెస్టు అయ్యాడు. పంజాబ్‌లోని మోగాకు చెందిన డల్లాకు కెనడాలో అక్టోబర్ 27-28న మిల్టన్ టౌన్‌లో జరిగిన సాయుధ ఘర్షణ (Shootout)లో ఇతని ప్రమేయం తెలుస్తోంది. కెనడాలో తన భార్యతో కలిసి డల్లా నివసిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల కథనం.
PM Modi: లూటీ చేసిన సొమ్ములు కక్కిస్తాం
కాగా, డల్లాను కస్టడీలోకి తీసుకున్నట్టు భారత భద్రతా ఏజెన్సీలకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం కోసం భద్రతా సంస్థలు ఎదురుచూస్తుండగా, డల్లాను అరెస్టు చేసినట్టు కెనడా పోలీసులు కానీ, అధికారులు కానీ ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. న్యూఢిల్లీ, అట్టావా మధ్య దౌత్య సంబంధాలు ఇటీవల కాలంలో దెబ్బతిన్న నేపథ్యంలో డల్లా అరెస్టు ప్రాధాన్యత సంచరించుకుంది.
కెటీఎఫ్ చీఫ్ హర్దీప్ నిజ్జర్ గత ఏడాది కెనడాలో హత్యకు గురికావడం, ఈ ఘటనలో భారత ఏజెన్సీల ప్రమేయం ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపించడంతో భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. నిజ్జర్‌కు సన్నిహితుడైన డల్లాకు భారతదేశంలో పలు క్రిమినల్ కేసులతో సంబంధాలు ఉన్నాయని ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. అతనిని డిజిగ్నేటెడ్ టెర్రరిస్టుగా కూడా 2023 జనవరిలో హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ప్రముఖ నటుడు కన్నుమూత.. సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం
యడియూరప్ప, శ్రీరాములుపై న్యాయ విచారణ!
For More National And Telugu News