Share News

ఖర్గే : మోదీని దించేదాకా బతికే ఉంటా!

ABN , Publish Date - Sep 30 , 2024 | 03:14 AM

జమ్మూకశ్మీరులోని కథువా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు.

 ఖర్గే : మోదీని దించేదాకా బతికే ఉంటా!

  • కశ్మీరు ఎన్నికల సభలో అస్వస్థతకు గురై

  • తేరుకున్న వెంటనే ఖర్గే వ్యాఖ్యలు

  • వేదికపై కింద పడబోయిన కాంగ్రెస్‌ చీఫ్‌

జస్రోటా/జమ్ము, సెప్టెంబరు 29: జమ్మూకశ్మీరులోని కథువా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన హెడ్‌కానిస్టేబుల్‌కు వేదికపై నివాళులర్పిస్తుండగా.. ఖర్గే కింద పడబోయారు. వెంటనే పార్టీ నేతలు ఆయన్ను పట్టుకున్నారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించిన వెంటనే తేరుకున్న ఖర్గే ప్రసంగాన్ని కొనసాగించారు. ‘‘నాకు 83ఏళ్లు. నేనంత తొందరగా ఏమీ చనిపోను. ప్రధాని మోదీని గద్దె దించే వరకు నేను బతికే ఉంటా’’అని స్పష్టంచేశారు. తనకు ఇంకా మాట్లాడాలని ఉన్నప్పటికీ నీరసం వల్ల కూర్చుండిపోవాల్సి వస్తోందని, క్షమించాలని ప్రజలను కోరారు. అంతకుముందు ఆయన కాంగ్రెస్‌.. దేశం కోసం చేసిన పనులను ఏకరువు పెట్టారు. మరోవైపు ఖర్గేకు ప్రధాని మోదీ ఫోన్‌ చేసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Sep 30 , 2024 | 03:14 AM