Share News

Red Fort: ఎర్రకోట మాది.. తిరిగిచ్చేయండి..

ABN , Publish Date - Dec 14 , 2024 | 11:41 AM

ఎర్రకోటను తిరిగి తనకు అప్పగించాలని కోరుతూ మొఘల్‌ చక్రవర్తి వారసురాలు దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. చివరి చక్రవర్తి బహదూర్‌ షా జాఫర్‌–2 ..

Red Fort: ఎర్రకోట మాది.. తిరిగిచ్చేయండి..
Red Fort

న్యూఢిల్లీ, డిసెంబరు 14: ఎర్రకోటను తిరిగి తనకు అప్పగించాలని కోరుతూ మొఘల్‌ చక్రవర్తి వారసురాలు దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. చివరి చక్రవర్తి బహదూర్‌ షా జాఫర్‌–2 మునిమనుమడి భార్య సుల్తానా బేగం ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. చక్రవర్తికి చట్టబద్ధ వారసురాలిని తానేనని, అందువల్ల ఎర్రకోటపై తనకు హక్కు ఉందని తెలిపారు. తొలుత ఇదే విషయమై దావా వేయగా పరిశీలించిన ఏకసభ్య ధర్మాసనం దాన్ని తిరస్కరిస్తూ 2021 డిసెంబరులో ఆదేశాలు ఇచ్చింది. సంఘటన జరిగి ఎన్నో దశాబ్దాల అనంతరం కేసు పెట్టినందున విచారణకు స్వీకరించలేమని తెలిపింది. దీనిపై అప్పీలు చేయగా ద్విసభ్య ధర్మాసనం.. ఏకసభ్య ధర్మాసనం తీర్పుపై అప్పీలుకు రెండున్నరేళ్లు ఎందుకు ఆగారని ప్రశ్నిస్తూ పిటిషన్‌ను తిరస్కరించింది.


Also Read:

అల్లు అర్జున్ ఇంటికి సినీ ప్రముఖులు

టీ-షర్ట్‌తో బన్నీ స్ట్రాంగ్ మెసేజ్

జమిలిపై సీఎం చంద్రబాబు కీలక కామెంట్స్

For More National News and Telugu News..

Updated Date - Dec 14 , 2024 | 11:41 AM