Share News

king charles 3: భారత్‌లో కింగ్ ఛార్లెస్ దంపతుల పర్యటన.. అంతా టాప్ సీక్రెట్‌

ABN , Publish Date - Oct 30 , 2024 | 03:03 PM

బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్ 3 దంపతులు బెంగళూరు విచ్చేశారు. అక్టోబర్ 26 నుంచి 30 వరకు వారు బెంగళూరులోనే ఉన్నారు. అయితే వీరి పర్యటన చాలా టాప్ సీక్రెట్‌గా జరిగింది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలను వెలువరించింది.

king charles 3: భారత్‌లో కింగ్ ఛార్లెస్ దంపతుల పర్యటన..  అంతా టాప్ సీక్రెట్‌

బెంగళూరు, అక్టోబర్ 30: బ్రిటన్ రాజు, కింగ్ ఛార్లెస్-3 దంపతులు భారత్‌‌కు విచ్చేశారు. కింగ్ ఛార్లెస్‌తోపాటు ఆయన సతీమణి క్వీన్ కెమెల్లా బెంగళూరు నగరానికి వచ్చారు. స్థానిక వెల్‌నెస్ సెంటర్‌లో ఈ దంపతులు చికిత్స తీసుకున్నారు. అందులోభాగంగా యోగా, మెడిటేషన్ సెంటర్‌‌లో వారు సాధన చేశారు. అయితే వీరు బుధవారం అంటే అక్టోబర్ 30వ తేదీన బ్రిటన్ బయలుదేరి వెళ్లనున్నారు. ఇక వీరు భారత్ ట్రిప్.. చాలా టాప్ సీక్రెట్‌‌గా జరుగుతుంది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేశాయి.

Also Read: Maharashtra: బరిలో భారీగా అభ్యర్థులు


ఆ యా కథనాల ప్రకారం.. అక్టోబర్ 21 నుంచి 26వ తేదీ మధ్య సమోవాలో కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కింగ్ చార్లెస్ -3 దంపతులు హాజరయ్యారు. అనంతరం సమోవా నుంచి నేరుగా వారు బెంగళూరు నగరానికి చేరుకున్నారు. వీరి రాక సందర్భంగా ప్రభుత్వం ఎక్కడా ఎటువంటి హంగు ఆర్భాటం అయితే చేయ లేదు. అంటే టాప్ సీక్రెట్ ట్రిప్ కావడంతో విమానాశ్రయంలో ఈ దంపతులకు ప్రభుత్వాధినేతలు ఎవరు వెళ్లి ఆహ్వానించ లేదని తెలుస్తుంది. మరోవైపు వెల్ నెస్ సెంటర్‌లో సిబ్బంది ఛార్లెస్ దంపతులకు వివిధ థెరపీ సెషన్స్ నిర్వహించారు.

Also Read: ఆలూ చిప్స్‌.. ఆరోగ్యానికి లాభమా? నష్టమా?


కింగ్ ఛార్లెస్ 3 బ్రిటన్ రాజుగా అధికారికంగా ప్రకటించిన అనంతరం ఆయన తొలిసారిగా భారత్ విచ్చేశారు. అయితే వేల్స్ యువరాజుగా ఉన్న సమయంలో ఆయన పలుమార్లు భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బెంగళూరులోని ఈ వెల్‌నెస్ సెంటర్‌కు ఆయన తొమ్మిది సార్లు విచ్చేసినట్లు జాతీయ మీడియా ఈ సందర్భంగా గుర్తు చేసింది. 2022లో రెండో క్వీన్ ఎలిజబెత్ రాణి మరణించారు. దీంతో బ్రిటన్ రాజుగా కింగ్ చార్జెస్ 3ని ఎంపిక చేయడం అనివార్యమైంది. దాంతో కింగ్ ఛార్జెస్ 3ని బ్రిటన్ రాజుగా ప్రకటించారు.

Also Read: Choti Diwali 2024: చోటి దీపావళి వేళ.. ఇలా..

Also Read: ICAI: నేడు సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల


బెంగళూరు మహానగరంలో సమేతనహళ్లిలో సౌఖ్య ఇంటర్నేషనల్ హోలిస్టిక్ హెల్త్ సెంటర్​‌లో కింగ్ ఛార్లెస్ 3 దంపతులు చికిత్స పొందుతున్నారు. డాక్టర్ ఇస్సాక్ మథాయ్, డాక్టర్ సుజా ఇస్సాక్ ఈ హోలిస్టిక్ హెల్త్ సెంటర్‌ను స్థాపించారు. ఆయుర్వేదం, నేచురోపతి, ఆక్యుప్రెషర్, యోగా, హోమియోపతి, ఇతర సంప్రదాయ చికిత్సలు చేస్తారని జాతీయ మీడియా తన కథనాల్లో వివరించింది.

Also Read: Reliance: పండగ వేళ.. రిలయన్స్ ఉద్యోగులకు బిగ్ గిఫ్ట్.. షాక్‌లో నెటిజన్లు

For Nationan News And Telugu News

Updated Date - Oct 30 , 2024 | 03:22 PM