Share News

Maharashtra: మహారాష్ట్రలో ఎన్డీయే విజయానికి కారణమిదే.. సీక్రెట్ చెప్పేసిన కేకే..

ABN , Publish Date - Nov 23 , 2024 | 08:09 PM

Maharashtra Election Results-KK Survey: మహారాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు దాదాపు ఖరారయ్యాయి. రాష్ట్రంలో మహాయుతి(ఎన్డీయే) కూటమిదే మరోసారి అధికారం అని ఎలక్షన్ కౌంటింగ్

Maharashtra: మహారాష్ట్రలో ఎన్డీయే విజయానికి కారణమిదే.. సీక్రెట్ చెప్పేసిన కేకే..
KK Survey

Maharashtra Election Results-KK Survey: మహారాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు దాదాపు ఖరారయ్యాయి. రాష్ట్రంలో మహాయుతి(ఎన్డీయే) కూటమిదే మరోసారి అధికారం అని ఎలక్షన్ కౌంటింగ్ ట్రెండ్స్ తేల్చేశాయి. 141 స్థానాల మెజార్టీ అవసరం ఉండగా.. 229 స్థానాల్లో మహాయుతి కూటమి లీడ్‌లో నిలిచింది. ఇప్పటికే 50కి పైగా స్థానాల్లో గెలుపొందింది. అయితే, మహారాష్ట్రలో మహాయుతి కూటమిదే అధికారం ఎన్నికల ముగిసిన రోజే కుండబద్దలుకొట్టి చెప్పింది కేకే(కిరణ్) సర్వే. స్వల్ప మెజార్టీ కాదు.. భారీ మెజార్టీతో మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఏర్పాటవుతుందని ప్రకటించారు. కేకే సర్వే ఎగ్జిట్ పోల్ ప్రకటించినట్లుగానే.. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 98 శాతం సర్వే నిజమైంది. తమ సర్వే విజయం కావడంతో.. కేకే సర్వే టీమ్ సంబరాలు చేసుకుంది. దీనిపై కేకే సర్వే యజమాని కిరణ్ మాట్లాడారు.


సీక్రెట్ రివీల్ చేసిన కేకే..

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు తాము ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ యథార్థంగా రావడంతో కేకే టీమ్ సంబరాలు చేసుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన కేకే.. తనకు అండగా నిలబడిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. తాను ముందే చెప్పిన విధంగా సర్వే ఫలితాలు వచ్చాయన్నారు. 98 శాతం తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని, ఎగ్జిట్ పోల్స్‌లో ఏదైతే చెప్పారో.. అవే నెంబర్స్ వచ్చాయని పేర్కొన్నారు. తమ సర్వే నెంబర్స్ ఎప్పుడూ నిజాలు చూపుతాయని.. అందుకు మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలే నిదర్శనం అని పేర్కొన్నారు కేకే.


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వరకే గతంలో సర్వే చేశామని.. ఇప్పుడు మహారాష్ట్రలో అడుగు పెట్టామన్నారు. తదుపరి దేశ వ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. హర్యానాలో తాము కొన్ని తప్పులు చేసినట్లు అంగీకరించారు కేకే. మహారాష్ట్రలో సర్వే చేయడం అనేది చాలా కష్టంగా పేర్కొన్నారు. అనేక ప్రాంతాలు, అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు కేకే తెలిపారు. మహారాష్ట్రలో మూడు నెలల నుంచి తాము సర్వే చెస్తున్నట్లు చెప్పారు.


ఎన్డీయే విజయానికి కారణమిదే..

వాస్తవానికి కేకే.. మహారాష్ట్రలో ఎన్నికలకు మూడు నెలల ముందు సర్వే చేపట్టారట. తొలుత సర్వేలో ఎన్డీయే వెనుకబడినట్లు గుర్తించారు. కానీ, ఎలక్షన్ ఇంజనీరింగ్‌లో ఎన్డీయే(మహాయుతి) కూటమి సక్సెస్ అయినట్లు కేకే తెలిపారు. ఎన్నికలకు నెల రోజులు ముందే ఎన్డీయే కూటమి పుంజుకుందన్నారు. బీజేపీ నుంచి ఇండియా కూటమి ఎలక్షన్ ఇంజినీరింగ్ నేర్చుకోవాలని కేకే సూచించారు.


Also Read:

కదులుతున్న రైలుపై యువతి నిర్వాకం చూస్తే..

‘మహా’ ఫలితాలను శాసించిన అదృశ్య శక్తి

తూచ్.. ఫార్మా కంపెనీ కాదు.. ఇండస్ట్రియల్ కారిడార్..

For More National News and Telugu News..

Updated Date - Nov 23 , 2024 | 10:04 PM