Share News

Kolkata : ప్రధాని మోదీకి మమత మరో లేఖ

ABN , Publish Date - Aug 31 , 2024 | 04:22 AM

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీకి శుక్రవారం మరో లేఖ రాశారు. హత్యాచార ఘటనలకు పాల్పడే వారిని శిక్షించేందుకు కఠిన చట్టం తీసుకురావాలని, నిర్దిష్ట కాలపరిమితిలో కేసుల్ని పరిష్కరించేలా అది ఉండాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Kolkata : ప్రధాని మోదీకి మమత మరో లేఖ

కోల్‌కతా, ఆగస్టు 30: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీకి శుక్రవారం మరో లేఖ రాశారు. హత్యాచార ఘటనలకు పాల్పడే వారిని శిక్షించేందుకు కఠిన చట్టం తీసుకురావాలని, నిర్దిష్ట కాలపరిమితిలో కేసుల్ని పరిష్కరించేలా అది ఉండాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ అంశంపై గత వారం తాను రాసిన లేఖకు ప్రధాని మోదీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. కేంద్ర మహిళా శిశుసంక్షేమశాఖ నుంచి తనకు బదులు వచ్చిందని, అయితే సమస్య తీవ్రత దృష్ట్యా ఆ సాధారణ సమాధానం సరిపోదని మమత పేర్కొన్నారు. గత వారం ఇదే అంశంపై మమత మోదీకి తొలిసారి లేఖ రాశారు. కాగా, కోల్‌కతాలో హత్యాచార ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం వచ్చే వారం ప్రత్యేక అసెంబ్లీ సెషన్‌ నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో అత్యాచారాలనిరోధానికి కొత్త బిల్లు తీసుకురానున్నట్లు పేర్కొంది.

Updated Date - Aug 31 , 2024 | 04:22 AM