Patna: ముస్లింలందరికీ రిజర్వేషన్లు ఉండాలి
ABN , Publish Date - May 08 , 2024 | 10:18 AM
ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని తాను స్వాగతిస్తానని బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. అయితే, రిజర్వేషన్లు మత ప్రాతిపదికన ఉండకూడదన్నారు. సామాజిక వెనుకబాటు ఆధారంగా ఇవ్వాలన్నారు.
కానీ, మత ప్రాతిపదికన కాదు: లాలూ
పట్నా, మే 7: ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని తాను స్వాగతిస్తానని బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. అయితే, రిజర్వేషన్లు మత ప్రాతిపదికన ఉండకూడదన్నారు. సామాజిక వెనుకబాటు ఆధారంగా ఇవ్వాలన్నారు. అంతకుముందు లాలూ ప్రసాద్ ముస్లిం రిజర్వేషన్లపై పట్నాలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ముస్లింలకు రిజర్వేషన్లు ఎందుకు ఉండకూడదు? ఉండాలి.. ముస్లింలందరికీ రిజర్వేషన్లు ఉండాలి’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర రాజకీయ దుమారం రేగింది. ప్రధాని మోదీ కూడా ఎన్నికల ప్రచారంలో లాలూ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి.. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ కోటాను తగ్గించి, ఆ రిజర్వేషన్లను ముస్లింలకు ఇస్తారని ఆరోపించారు. దీంతో, లాలూ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.