Video: సునామీల విజృంభించిన కొర్టాలమ్ జలపాతం.. కళ్ల ముందే కొట్టుకుపోయిన బాలుడు
ABN , Publish Date - May 17 , 2024 | 07:41 PM
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. అయితే పర్యాటక ప్రాంతాలుగా ఉన్న జలాశయాల వద్ద అధికారులు సరైన భద్రతాచర్యలు తీసుకోకపోవడంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా తమిళనాడులో జలాశయానికి వరద పోటెత్తడంతో 16 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
చెన్నై: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. అయితే పర్యాటక ప్రాంతాలుగా ఉన్న జలాశయాల వద్ద అధికారులు సరైన భద్రతాచర్యలు తీసుకోకపోవడంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా తమిళనాడులో జలాశయానికి వరద పోటెత్తడంతో 16 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో టెంకాసిలోని కొర్టాలమ్ జలపాతానికి(Courtallam falls) వరద పోటెత్తింది. ఒక్కసారిగా వరద ముంచుకురావడాన్ని గమనించిన సందర్శకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు.
ఈ ఘటనలో వరద ఓ బాలుడ్ని ప్రవాహంలో లాక్కెల్లింది. విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జలపాతం సందర్శనపై తాత్కాలికంగా నిషేధం విధించారు. తమిళనాడు అగ్నిమాపక, రక్షణ విభాగానికి చెందిన ఓ బృందం వాటర్ ఫాల్స్ దగ్గరికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.
వాటర్ ఫాల్‌కు వరద పోటెత్తిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా పర్యాటకులను వాటర్ ఫాల్స్ చూడటానికి అనుమతివ్వడంపై పౌరులు మండిపడుతున్నారు. తప్పిపోయిన బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
For More National News and Telugu News..