Share News

LDF-UDF : కమ్యునిస్టులు, కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విసుర్లు

ABN , Publish Date - Jan 03 , 2024 | 07:31 PM

కమ్యునిస్టులతోపాటు కాంగ్రెస్ పార్టీని ఏకీపారేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi). కామ్రేడ్ల కంచుకోట కేరళలో బుధవారం నాడు ప్రధాని పర్యటించారు. ఆ రెండు పార్టీల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

LDF-UDF :  కమ్యునిస్టులు, కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విసుర్లు

కేరళ : కమ్యునిస్టులతోపాటు కాంగ్రెస్ పార్టీని ఏకీపారేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi). కామ్రేడ్ల కంచుకోట కేరళలో బుధవారం నాడు ప్రధాని పర్యటించారు. ఆ రెండు పార్టీల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళా శక్తిని ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములు తక్కువ అంచనా వేశాయని మండిపడ్డారు. చట్టసభల్లో మహిళల కోసం తమ ప్రభుత్వం రిజర్వేషన్ తీసుకొచ్చిందని గుర్తుచేశారు. తెక్కిన్‌కడులో జరిగిన స్త్రీ శక్తి కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాక్ రద్దు చేశామని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎల్డీఎఫ్, యూడీఎఫ్ (LDF, UDF) కూటమిలు కేరళలో ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయని తెలిపారు. మహిళల కోసం ఏ కార్యక్రమాలు చేయలేదన్నారు.

ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం సోదరీలు ఇబ్బంది పడ్డారని తెలిపారు. వారి కోసం చట్టం తీసుకొచ్చామని.. స్వేచ్చా వాయువును తమ ప్రభుత్వమే ప్రసాదించామని పేర్కొన్నారు. గతంలో ఉన్న పాలకులు మైనార్టీల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. తనను ఆశీర్వదించేందుకు ఇక్కడికి చాలా మంది మహిళలు వచ్చారని ప్రధాని మోదీ అన్నారు. కాశీ (వారణాసి) నుంచి ఎంపీ అవడం తనకు సంతోషంగా ఉందని తెలిపారు. కాశీని శివ నగరంగా పిలుస్తారని వివరించారు. కమ్యూనిస్టుల కంచుకోటలో మోదీ పర్యటించి.. మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీపై కూడా విమర్శలు చేశారు. వాయనాడు నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికల సమయం సమీపిస్తోన్న వేళ కేరళ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

Updated Date - Jan 03 , 2024 | 07:31 PM