Share News

Lok Sabha polls 2024: హనుమాన్ చాలీసా వినడం కూడా నేరంగా చూశారు: మోదీ

ABN , Publish Date - Apr 23 , 2024 | 02:44 PM

కాంగ్రెస్ హయాంలో 'హనుమాన్ చాలీసా' వినడం కూడా నేరంగా చూసేవారని, ఇందువల్ల రాజస్థా్న్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఏడాది తొలిసారిగా 'రామనవమి' సందర్భంగా రాష్ట్రంలో శోభా యాత్ర ఊరేగింపు జరిగిందని చెప్పారు.

Lok Sabha polls 2024: హనుమాన్ చాలీసా వినడం కూడా నేరంగా చూశారు: మోదీ

టాంక్: కాంగ్రెస్ హయాంలో 'హనుమాన్ చాలీసా' వినడం కూడా నేరంగా చూసేవారని, ఇందువల్ల రాజస్థా్న్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ఈ ఏడాది తొలిసారిగా 'రామనవమి' సందర్భంగా రాష్ట్రంలో శోభా యాత్ర ఊరేగింపు జరిగిందని చెప్పారు. టాంక్-సవాయ్ మథోపూర్‌లో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, హనుమాన్ చాలీసా నిత్య పారాయణం చేసే రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో రామనవమిని కాంగ్రెస్ నిషేధించిందని అన్నారు.


హనుమాన్ జయంతి గురించి ఈరోజు మాట్లాడాలనుకున్నప్పుడు కొద్ది రోజుల క్రితం నాటి ఒక ఫోటో తనకు గుర్తుకువచ్చిందని మోదీ చెప్పారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఇటీవల ఒక వ్యాపారి తన దుకాణంలో కూర్చొని హనుమాన్ చాలీసా వింటుండగా కొందరు వ్యక్తులు అతిదారుణంగా అతన్ని చితకబాదారని గుర్తుచేశారు.

Mamata Banerjee: అది చట్టవిరుద్ధం.. కోల్‌కతా హైకోర్టు తీర్పుపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు


''2014లో మీరు ఢిల్లీకి సేవ చేసే అవకాశం మోదీకి ఇచ్చారు. దేశం ఎన్నడూ ఊహించని ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నాం. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జమ్మూకశ్మీర్‌లో మన జవాన్లపై అనునిత్యం రాళ్ల వర్షం కురిసేది. సరిహద్దుల నుంచి శత్రువులు మన సైనికులపై పడి తలలు తెరనరుకుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండేది. సైనికులకు 'వన్ ర్యాంక్ వన్ ఫెన్షన్' అమలు చేయలేదు. బాంబు పేలుళ్లు చేటుచేసుకునేవి. కాంగ్రెస్ హయాంలో నేరాల్లో రాజస్థాన్ నెంబర్ వన్‌గా ఉండేది'' అని మోదీ తెలిపారు. దశాబ్దాలుగా సరిహద్దుల్లో దేశాన్ని రాజస్థాన్ కాపాడుతూ వచ్చిందని, సురక్షిత దేశం, సురక్షిత ప్రభుత్వం ఎలా సాధ్యమో రాజస్థాన్‌కు బాగా తెలుసునని, 2014, 2019లో రాజస్థాన్ సమష్టిగా దేశంలో పటిష్ట బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గట్టి చేయూతనిచ్చిందని ప్రశంసించారు. ఐక్యతే రాజస్థాన్ సంపద అని, విడిపోతే శత్రువు దానిని తనకు అనుకూలంగా మార్చుకుంటాడని అన్నారు. ఇప్పుడు కూడా రాజస్థాన్‌ను, రాజస్థాన్ ప్రజలను విడగొట్టే ప్రయత్నం జరుగుతోందని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని హెచ్చరించారు. గత పదేళ్లలో నిలకడైన, నిజాయితీ కలిగిన ప్రభుత్వం ఉండే దేశం ఎంతగా అభివృద్ధి చెందుతుందో అంతా చూశారని అన్నారు. హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా అందరికీ మోదీ శుక్షాకాంక్షలు తెలిపారు.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 23 , 2024 | 02:44 PM