Share News

LK Advani - PM Modi: ఎల్‌కే అద్వానీకి ‘భారత రత్న’.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన

ABN , Publish Date - Feb 03 , 2024 | 11:51 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ (Bharat Ratna) ప్రదానం చేయనున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేయడం చాలా సంతోషంగా ఉందని ఎక్స్ వేదికగా ఆయన తెలిపారు.

LK Advani - PM Modi: ఎల్‌కే అద్వానీకి ‘భారత రత్న’.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ (Bharat Ratna) ప్రదానం చేయనున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేయడం చాలా సంతోషంగా ఉందని ఎక్స్ వేదికగా ఆయన తెలిపారు. ‘‘ భారత రత్న గౌరవం అందుకోబోతున్న ఎల్‌కే అద్వానీతో నేను మాట్లాడి అభినందనలు తెలిపాను. మన కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరు. దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనది. అద్వానీ జీవితంలో క్షేత్రస్థాయిలో పని చేయడం మొదలుపెట్టి ఉప ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేసే అత్యున్నత స్థాయికి ఎదిగారు. మన హోంమంత్రిగా, ఐఅండ్‌బీ(Ministry of Information and Broadcasting) మంత్రిగా కూడా సేవలు అందించారు. పార్లమెంట్‌లో ఆయన అడుగులు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయమైనవి, గొప్ప దూరదృష్టితో నిండి ఉన్నాయి’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.


ఎల్‌కే అద్వానీకి భారతరత్న అవార్డును ప్రదానం చేయడం తనకు చాలా భావోద్వేగభరితమైన క్షణమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఎల్‌కే అద్వానీతో ఉన్న రెండు ఫొటోలను ప్రధాని షేర్ చేశారు. అద్వానీ దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో పారదర్శకత, సమగ్రతతో సేవలు అందించారని కొనియాడారు. తిరుగులేని నిబద్ధత, రాజకీయ నైతికతలతో ఆదర్శప్రాయమైన ప్రమాణాలను నెలకొల్పారని ప్రధాని మోదీ ప్రశంసించారు. జాతీయ ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం ఆయన అసమానమైన కృషి చేశారని ప్రశంసల జల్లు కురిపించారు. ఆయనతో మాట్లాడి, ఆయ నుంచి పాఠాలు నేర్చుకోవడానికి తనకు లెక్కలేనన్ని అవకాశాలు లభించడం ఎల్లప్పుడు గొప్ప అదృష్టంగా భావిస్తానని మోదీ చెప్పారు.

బీజేపీకి అత్యధిక కాలం అధ్యక్షుడిగా పనిచేసిన అద్వానీ

బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ బీజేపీకి అత్యధికకాలం అధ్యక్షుడిగా పనిచేసిన ఘనత వహించారు. 1980లో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి అత్యధిక కాలం అధ్యక్షుడిగా కొనసాగారు. ఇక అటల్ బిహారీ వాజ్‌పేయి సారధ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చిన 90వ దశకంలో బీజేపీ ఎదుగుదల కోసం ఎల్‌కే అద్వానీ విశేష కృషి చేశారు. 2002-04 వరకు అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని మంత్రివర్గంలో ఉప ప్రధానిగా దేశానికి సేవలు అందించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2024 | 01:44 PM