Share News

Loksabha Elections 2024: అరుణాచల్ నుంచి తొలి అభ్యర్థిని ప్రకటించిన నితీష్

ABN , Publish Date - Jan 03 , 2024 | 04:50 PM

జనతా దళ్ యునైటెడ్ అధ్యక్షుడిగా తిరిగి పగ్గాలు చేపట్టిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్ నుంచి పోటీ చేసే తొలి అభ్యర్థిని ప్రకటించారు. అరుణాచల్ వెస్ట్ పీసీ నుంచి జేడీయూ అభ్యర్థిగా రుహి తంగుంగ్ పోటీ చేస్తారని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.

Loksabha Elections 2024: అరుణాచల్ నుంచి తొలి అభ్యర్థిని ప్రకటించిన నితీష్

పాట్నా: జనతా దళ్ యునైటెడ్ (JDU) అధ్యక్షుడిగా తిరిగి పగ్గాలు చేపట్టిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) 2024 లోక్‌సభ ఎన్నికల్లో (2024 Lok Sabha elections) అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) నుంచి పోటీ చేసే తొలి అభ్యర్థిని ప్రకటించారు. అరుణాచల్ వెస్ట్ పీసీ (పార్లమెంటరీ నియోజవర్గం) నుంచి జేడీయూ అభ్యర్థిగా రుహి తంగుంగ్ పోటీ చేస్తారని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్ జేడీయూ అధ్యక్షుడిగా తంగుంగ్ ఉన్నారు.


అరుణాచల్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏకకాలంలో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని జేడీయూ అధికారిక ప్రకటన తెలిపింది. జేడీయూ అధ్యక్షుడిగా నితీష్ కుమార్ గత వారంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 'ఇండియా' (INDIA)కూటమిలో కూడా ఆ పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. కూటమి కన్వీనర్‌గా నితీష్ కుమార్‌ పేరును ప్రతిపాదించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Updated Date - Jan 03 , 2024 | 04:50 PM