Share News

Lok Sabha Elections: 'ఆప్' ప్రచారం మొదలైంది..

ABN , Publish Date - Mar 08 , 2024 | 02:22 PM

రెండు రాష్ట్రాల్లో అధికారం, పలు రాష్ట్రాల్లో ఉనికిని చాటుకుని జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన 'ఆమ్ ఆద్మీ పార్టీ' లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టుంది. డీడీయూ మార్గ్‌లోని ఆప్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎన్నికల ప్రచారాన్ని పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు.

Lok Sabha Elections: 'ఆప్' ప్రచారం మొదలైంది..

న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాల్లో అధికారం, పలు రాష్ట్రాల్లో ఉనికిని చాటుకుని జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన 'ఆమ్ ఆద్మీ పార్టీ' (AAP) లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టుంది. డీడీయూ మార్గ్‌లోని ఆప్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎన్నికల ప్రచారాన్ని పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రారంభించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇండియా (I.N.D.I.A.) కూటమి భాగస్వామ్య పార్టీగా ఆప్ ఇప్పటికే కాంగ్రెస్‌తో ఢిల్లీ, గుజరాత్, హర్యానాలో పొత్తులు ఖరారు చేసింది.


పార్లమెంటులో మరింత బలపడదాం...

ఢిల్లీ ప్రజలంతా తన కుటుంబ సభ్యులనీ, ప్రజా సేవకు అంకింతమై పని చేస్తున్నామని కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం సందర్బంగా మాట్లాడుతూ అన్నారు. పార్లమెంటులో బలపడటం ద్వారా ఢిల్లీ ప్రజల అభ్యదయానికి మరింత పాటుపడగలమని, ఇందుకు పట్టుదలగా పనిచేయాలని కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. కూటమి పొత్తుల్లో భాగంగా ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాల్లో 4 స్థానాల్లో ఆప్, 3 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ పొత్తుతో గుజరాత్‌లోని బరూచ్, జామ్‌నగర్‌, హర్యానాలోని కురుక్షేత్ర నుంచి ఆప్ పోటీ చేస్తోంది. పంజాబ్‌లో ఆప్ పొత్తులు లేకుండా పోటీ చేస్తోంది. అసోంలోని గువాహటి, డిబ్రూగఢ్, సోనిపట్ లోక్‌సభ నియోజకవర్గాలకు కూడా ఆప్ తమ అభ్యర్థులను ప్రకటించింది. 18వ లోక్‌సభ ఎన్నికు ఏప్రిల్-మే నెలల్లో జరుగనున్నాయి. 17వ లోక్‌సభ గడవు జూన్ నెలాఖరుతో ముగియనుంది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, మోదీ వరుసగా రెండోసారి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టారు.

Updated Date - Mar 08 , 2024 | 02:22 PM