Share News

Lok Sabha Elections 2024: బీజేపీ 400 సీట్లకు ధీటుగా కాంగ్రెస్ జాతీయ కనీస వేతనం రూ.400

ABN , Publish Date - May 01 , 2024 | 03:59 PM

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 'శ్రామిక్ న్యాయ్' హామీని పునరుద్ఘాటించింది. రోజుకు రూ.400 చొప్పున జాతీయ కనీస వేతనం కల్పించడం తమ వాగ్దానమని, ఇదే నిజమైన '400 పార్' అని తెలిపింది.

Lok Sabha Elections 2024: బీజేపీ 400 సీట్లకు ధీటుగా కాంగ్రెస్ జాతీయ కనీస వేతనం రూ.400

న్యూఢిల్లీ: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (International Labour Day) సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 'శ్రామిక్ న్యాయ్' హామీని పునరుద్ఘాటించింది. రోజుకు రూ.400 చొప్పున జాతీయ కనీస వేతనం కల్పించడం (National minimum wage) తమ వాగ్దానమని, ఇదే నిజమైన '400 పార్' అని తెలిపింది. ఈసారి 400 సీట్లు పైమాటేనంటూ బీజేపీ చేస్తున్న నినాదానికి ధీటుగా కాంగ్రెస్ ఈ హామీని తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇప్పటికే పొందుపరిచింది.

Delhi: ముస్లింలకే ఎక్కువ మంది పిల్లలుంటారా.. ప్రధాని మోదీ ఆరోపణలకు ఖర్గే కౌంటర్


కాంగ్రెస్ 'శ్రామిక్ న్యాయ్' హామీని మేడే సందర్భంగా గుర్తుచేసుకోవడం ఎంతో కీలకమని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయ్ పాత్ర (మేనిఫెస్టో) కార్మికులకు కచ్చితమైన హామీలను ఇచ్చిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ చెప్పారు. శ్రామిక శక్తిని గౌరవించుకునేందుకు ఎంజీఎన్ఆర్ఈజీఏతో సహా కార్మికులకు రోజుకు రూ.400 చొప్పున జాతీయ కనీస వేతనాన్ని అమలు చేస్తుందని భరోసా ఇచ్చారు. ఇదే నిజమై 400 పార్...అని తెలిపారు. బీజేపీ ఇచ్చిన '400 పార్' నినాదం కేవలం రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశంతో ఇచ్చిందేననిని అన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మారుస్తామని 1950 నుంచి ఆర్ఎస్ఎస్ చెబుతూనే ఉందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన శ్రామిక్ న్యాయ్ గ్యారెంటీలను ఆయన వివరిస్తూ, 'సబ్ కో స్వస్థ్ అధికార్' కింద రూ.25 లక్షల యూనివర్శల్ హెల్త్ కవరేజ్ ఇస్తామని, ఉచిత వైద్య పరీక్షలు, మందలు, చికిత్స, సర్జరీ సేవలు అందిస్తామని చెప్పారు. 'పట్టణ ఉపాధి గ్యారెంటీ' కింద పట్టణ ప్రాంతాల్లో కొత్త ఉద్యోగాల హామీ చట్టాన్ని తెస్తామని తెలిపారు. అసంఘటిత రంగ కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. కీలక ప్రభుత్వ రంగాల్లో కాంట్రాక్ పద్దతిలో ఉద్యోగాల కల్పనను రద్దు చేస్తామని కూడా కాంగ్రెస్ వాగ్దానం చేసిందని జైరామ్ రమేష్ తెలిపారు.

Read Latest News and National News here

Updated Date - May 01 , 2024 | 03:59 PM