Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార సారథ్యం.. హస్తినలో సునీతా కేజ్రీవాల్ రోడ్‌షో
ABN , Publish Date - Apr 27 , 2024 | 08:04 PM
ఆమ్ ఆద్మీ పార్టీ తరపున కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ లోక్‌సభ ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. పార్టీ ఈస్ట్ ఢిల్లీ అభ్యర్థి కుల్‌దీప్ కుమార్ తరఫున శనివారంనాడు ప్రచారం సాగించారు. ఇందులో భాగంగా రోడ్‌షో నిర్వహించారు.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ తరపున కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ (Sunita Kejriwal) లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారబరిలోకి దిగారు. పార్టీ ఈస్ట్ ఢిల్లీ అభ్యర్థి కుల్‌దీప్ కుమార్ (Kuldeep Kumar) తరఫున శనివారంనాడు ప్రచారం సాగించారు. ఇందులో భాగంగా రోడ్‌షో నిర్వహించారు. జ్యుడిషియల్ కస్టడీకి పంపిన ఢిల్లీ పుత్రుడు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను, ఆప్ అభ్యర్థులను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కల్యాణ్‌పురి బ్లాక్ 20 నుంచి సుమారు 1.5 కిలోమీటర్ల మేర ఈ రోడ్‌షో సాగింది. 25 నిమిషాల పాటు సాగిన ఈ యాత్రకు ఐదు చోట్ల ప్రజలు స్వాగతం పలికారు.
Arvind Kejriwal: కేజ్రీవాల్ జైలులో పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు.. ఎయిమ్స్ మెడికల్ టీమ్
''బీజేపీ ఆటలు ఇంకెంతమాత్రం సాగనీయరాదు. ఢిల్లీ, పంజాబ్ సహా దేశంలోని అన్ని చోట్ల కేజ్రీవాల్ అరెస్టుపై సామాన్య ప్రజానీకం నిరసనలు తెలుపుతోంది. ప్రధాన మంత్రి నియంతృత్వానికి, ప్రజాస్వామ్యంపై దాడులకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తవుతున్నాయి. కేజ్రీవాల్ అరెస్టుకు ఓటుతోనే సమాధానం చెబుతామని ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు'' అని సునీతా కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా ఆప్ ఆద్మీ పార్టీ ఈస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ, న్యూఢిల్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. ఈశాన్య ఢిల్లీ, వాయవ్య ఢిల్లీ, చాందినీ చౌక్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోంది. కేంద్రంలో 'ఇండియా' కూటమి అధికారంలోకి వస్తే పేదలకు ఉచిత కరెంట్, దేశంలోని ప్రతి గ్రామంలోనూ, పట్టణాల్లోనూ ఆరోగ్య, విద్యా వసతులు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఆప్ వాగ్దానం చేసింది.
Read Latest National News and Telugu News