Share News

Lok Sabha Polls 2024: ఆప్ 'ప్రచారం' సాంగ్‌పై ఈసీ నిషేధం... తప్పుపట్టిన అతిషి

ABN , Publish Date - Apr 28 , 2024 | 02:44 PM

లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం 'ఆమ్ ఆద్మీ పార్టీ' రూపొందించిన పాటను భారత ఎన్నికల సంఘం నిషేధించింది. ఈ నిర్ణయాన్ని ఆప్ తప్పుపట్టింది. ఎన్నికల సంఘం ఆశ్రితపక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపించింది.

Lok Sabha Polls 2024: ఆప్ 'ప్రచారం' సాంగ్‌పై ఈసీ నిషేధం... తప్పుపట్టిన అతిషి

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం 'ఆమ్ ఆద్మీ పార్టీ' (AAP) రూపొందించిన పాట (Song)ను భారత ఎన్నికల సంఘం (ECI) నిషేధించింది. ఈ నిర్ణయాన్ని ఆప్ తప్పుపట్టింది. ఎన్నికల సంఘం ఆశ్రితపక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపించింది.


''విపక్ష నేతలపై దాడులకు ఈడీ, సీబీఐలను బీజేపీ ఉపయోగించుకుంటే వాళ్లను ఈసీ మార్చలేదు. తప్పుడు అరెస్టులు చోటుచేసుకున్నాయంటూ ప్రచారంలో ఎవరైనా మాట్లాడితే మాత్రం ఎన్నికల సంఘం దానిని ఒక సమస్యగా చూస్తోంది. నియంతృత్వ ప్రభుత్వం లక్షణం ఇది'' అని ఆప్ నేత అతిషి ఆరోపించారు.

RSS: రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..


కాగా, దీనికి ముందు ఆదివారం ఉదయం కేజ్రీవాల్‌కు మద్దతుగా 'వాక్ ఫర్ కేజ్రీవాల్' పేరుతో పాదయాత్రతో ఆప్ ప్రచారం నిర్వహించింది. ఢిల్లీలోని సీఆర్ పార్క్ నుంచి ఈ పాదయాత్ర సాగింది. 'జైల్ కా జవాబ్ ఓట్ సే' అనే నినాదాలతో కేజ్రీవాల్ ఫోటో, పార్టీ జెండాలతో ఆప్ మద్దతుదారులు ఇందులో పాల్గొన్నారు. ఆప్ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Updated Date - Apr 28 , 2024 | 02:54 PM