Share News

No Cash Payments: పెట్రోల్ పంప్, సూపర్ మార్కెట్లలో నగదు చెల్లింపులు బంద్.. పోలీసుల ప్రకటన

ABN , Publish Date - Nov 03 , 2024 | 08:06 AM

పెట్రోల్ పంపులు, గ్యాస్ రీఫిల్లింగ్ స్టేషన్లు, సూపర్ మార్కెట్ల వంటి ప్రదేశాలలో నగదు లావాదేవీలను నిలిపివేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు. కొత్త సంవత్సరం నుంచి ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి. అయితే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

No Cash Payments: పెట్రోల్ పంప్, సూపర్ మార్కెట్లలో నగదు చెల్లింపులు బంద్.. పోలీసుల ప్రకటన
No Cash Payments

దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ మెరుగైనప్పటికీ కొన్ని చోట్ల నగదు లావాదేవీలు కూడా చేస్తున్నారు. అయితే ఈ క్యాష్ చెల్లింపుల కారణంగా అక్రమాలు జరుగుతున్నాయని పోలీసులు అంటున్నారు. అందుకే ఇకపై నగదు చెల్లింపులకు అనుమతి లేదని ప్రకటించారు. మధ్యప్రదేశ్(madhya Pradesh ) పోలీసులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాది నుంచి మధ్యప్రదేశ్‌లో ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ పంపులు, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల కొనుగోలు సహా పోలీసు క్యాంటీన్‌లలో నగదు లావాదేవీలు పూర్తిగా నిలిపివేయబడతాయని ప్రకటించారు.


ఈ నిర్ణయం వీరికి మాత్రమే

ఈ కొత్త నిబంధనలు జనవరి 1, 2025 నుంచి రాష్ట్రం మొత్తం అమలులోకి వస్తాయి. మోసాలను అదుపులో ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. భోపాల్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ (PHQ) నగదును నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు పోలీసు ప్రభుత్వేతర సంస్థలకు మాత్రమే వర్తిస్తాయి. అంటే ఈ మార్పులు సామాన్యులను ప్రభావితం చేయవు. కానీ పోలీసులు మాత్రం కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.


నిబంధనలు ఎక్కడ వర్తిస్తాయి?

జనవరి 1, 2025 నుంచి మధ్యప్రదేశ్‌లోని అన్ని పోలీస్ కళ్యాణ్ పెట్రోల్ పంపులు, LPG గ్యాస్, పోలీసు గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలు, సూపర్ మార్కెట్‌లు, పోలీసు ప్రాంగణాల ఏర్పాట్లలో నగదు లావాదేవీలు పూర్తిగా నిలిపివేయబడతాయి. ఈ సౌకర్యాలను పొందేందుకు పోలీసు సిబ్బంది ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఇది స్కామ్ అవకాశాన్ని తొలగిస్తుంది. అలాగే పోలీసు శాఖలో పారదర్శకత కొనసాగుతుంది. 6 లక్షల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కార్యకలాపాలకు ఈ నియమాలు వర్తిస్తాయని వెల్లడించారు.


ఇక్కడ మాత్రం

రాష్ట్రంలో మోసాలు, అక్రమార్జనలను అరికట్టేందుకు నగదు రహిత లావాదేవీలను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు పీహెచ్‌క్యూ తెలిపింది. ఈ నిబంధనలు పంచమర్హి మినహా మొత్తం రాష్ట్రంలో అమలు చేయబడతాయి. అయితే పంచమర్హిలో మాత్రం నగదు లావాదేవీలు కొనసాగుతాయి.


కామెంట్లు

ఇది తెలిసిన పలువురు అక్రమాలు చేస్తే పట్టుకోవాల్సిన పోలీసులు కూడా అవినీతికి పాల్పడుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. కేవలం పోలీసులకు మాత్రమే నగదు లావాదేవీలు రద్దు చేశారంటే ఇక్కడ అక్రమాలు జరిగాయని అంటున్నారు. అయితే ఏ మేరకు అక్రమాలు జరిగాయనే విషయాలను కూడా వివరించాలని కోరుతున్నారు. వచ్చే ఏడాది నుంచి అమలు కానున్న ఈ రూల్స్ పోలీసులు పాటిస్తారా లేదా అనేది చూడాలి మరి. మరోవైపు సామాన్య ప్రజలు మాత్రం ఈ నిబంధనలు తమకు లేవని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు పోలీసులకు కొత్త రూల్స్ పెట్టడంపై కొంతమంది ఆశ్చర్యపోతున్నారు.


ఇవి కూడా చదవండి:

Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..

Penny Stock: లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు.. దేశంలోనే ఖరీదైన స్టాక్‌గా రికార్డ్

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 03 , 2024 | 08:08 AM