MahaRastra: మిగిలింది 48 గంటలే.. కొలిక్కి రాని పంచాయతీ
ABN , Publish Date - Oct 27 , 2024 | 07:57 PM
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి తేదీ అక్టోబర్ 29వ తేదీ. ఈ నేపథ్యంలో మహావికాస్ అఘాడీ, మహాయుతి కూటమిలు నాలుగో వంతు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. అయితే ఈ రెండు కూటముల్లో సీట్ల పంచాయతీ ఒక కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితులు ఏర్పడినట్లు సమాచారం.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం మరో 48 గంటల్లో అంటే.. అక్టోబర్ 28వ తేదీ సాయంత్రంతో ముగియనుంది. అయితే అటు మహా వికాస్ అఘాడీ, ఇటు మహాయుతిలో సీట్ల పంచాయతీ ఒక కొలిక్కి రాలేదు. ఇప్పటి వరకు మహా వికాస్ అఘాడీ 239 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అలాగే మహాయుతి 215 మంది అభ్యర్థుల పేరుతో జాబితాను విడుదల చేసింది. దీంతో ఈ రెండు కూటములు దాదాపు నాలుగో వంతు అభ్యర్థులను ప్రకటించవలసి ఉంది. మహాయుతి 73 స్థానాల్లో.. మహా వికాస్ అఘాడీ 49 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
Also Read: Tamilnadu Politics: ఎన్టీఆర్ స్పూర్తితోనే.. విజయ్ సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ ఎన్నికలు ఒకే విడతలో అంటే.. నవంబర్ 20వ తేదీన జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు అక్టోబరి 23న వెలువడనున్నాయి. అయితే కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (ఉద్దవ్ ఠాక్రే)లు మహా వికాస్ అఘాడీలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. ఈ మూడు పార్టీలు అగ్రనేతలు ఇటీవల సమావేశమై.. చేరో 85 సీట్లలో అభ్యర్థులను బరిలో దింపాలని నిర్ణయించాయి. అంటే 255 సీట్లలో అభ్యర్థులను బరిలో నిలుపుతాయి.
Also Read: Telangana Politics: శుద్ధపూసలా మాట్లాడుతున్న కడియం శ్రీహరి
మిగిలిన సీట్లను మహా వికాస్ అఘాడీకి వెనుక ఉండి మద్దతు ఇచ్చే పార్టీకి కేటాయించాలని భావించాయి. ఆ క్రమంలో ఈ మూడు పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. అందులోభాగంగా కాంగ్రెస్ పార్టీ 87, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) 85, ఎన్సీపీ (శరద్ పవార్) వర్గం 67 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మిలిగిన స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ఎప్పుడు ప్రకటిస్తారనే ఓ చర్చ సైతం ఆయా పార్టీ శ్రేణుల్లో కొనసాగుతుంది.
Also Read: Viral Video: భలే వాడివి బాసు: చేతులు లేవు... కానీ బండి నడిపి.. ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు
ఇక బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) భాగస్వామ్య పక్షాలుగా మహాయుతి కూటమి ఉంది. ఈ కూటమి 215 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో బీజేపీ అత్యధికంగా 121 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక శివసేన షిండే వర్గం 45, ఎన్సీపీ (అజిత్ పవార్) 49 మంది అభ్యర్థులను ప్రకటించింది.
Also Read: AP Politics: జగన్‌కి ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా ?
Also Read: రోజు బీరు తాగుతున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలు గ్యారంటీ..
మరి అభ్యర్థుల నామినేషన్లు వేసేందుకు కేవలం 48 గంటలే ఉంది. దీంతో ఈ రెండు కూటములు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయనే అంశంపై ఆయా పార్టీల శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
For National News And Telugu News