Share News

Maharashtra: అలిగి.. సొంతూరికి శిందే

ABN , Publish Date - Nov 30 , 2024 | 05:21 AM

మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరనే విషయంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఢిల్లీలో బీజేపీ అధిష్టానంతో గురువారం చర్చల తర్వాత శుక్రవారం ముంబైలో జరగాల్సిన మహాయుతి కూటమి సమావేశం రద్దు అయింది.

Maharashtra: అలిగి.. సొంతూరికి శిందే

  • డిప్యూటీతో పాటు హోం కూడా ఇవ్వాలని పట్టు

  • సీఎం వద్దే హోం ఉంటుందని బీజేపీ స్పష్టీకరణ

  • ముంబైలో మహాయుతి సమావేశం రద్దు

ముంబై, నవంబరు 29: మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరనే విషయంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఢిల్లీలో బీజేపీ అధిష్టానంతో గురువారం చర్చల తర్వాత శుక్రవారం ముంబైలో జరగాల్సిన మహాయుతి కూటమి సమావేశం రద్దు అయింది. తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఏక్‌నాథ్‌ శిందే తన సొంతూరు సతారాకు వెళ్లిపోయారు. ఢిల్లీ సమావేశంలో ఆయన పట్టణాభివృద్ధి శాఖతో పాటు హోం మంత్రిత్వ శాఖ కూడా అడిగినట్లు తెలిసింది. హోం శాఖ సీఎం వద్దే ఉంటుందంటూ బీజేపీ అధిష్టానం నిరాకరించినట్లు సమాచారం.


ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఢిల్లీలో గురువారం రాత్రి జరిగిన సమావేశం తర్వాత విలేకరులకు ఏ విషయమూ చెప్పకుండానే నేతలంతా మౌనంగా వెళ్లిపోయారు. ముంబై తిరిగి వచ్చిన శిందే సొంతూరుకు వెళ్లిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు శిందే సొంతూరుకు వెళ్తుంటారని శివసేన నేత సంజయ్‌ సిర్సాట్‌ వెల్లడించారు. కాగా, మహాయుతి సమావేశం ఆదివారం జరుగనుంది.

Updated Date - Nov 30 , 2024 | 05:21 AM