Share News

Devendra Fadnavis: ప్రధానితో మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌ భేటీ

ABN , Publish Date - Dec 13 , 2024 | 05:54 AM

మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ గురువారం ప్రధాని మోదీతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Devendra Fadnavis: ప్రధానితో మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌ భేటీ

న్యూఢిల్లీ, డిసెంబరు 12: మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ గురువారం ప్రధాని మోదీతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 5న మహారాష్ట్ర సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ప్రధానిని ఫడణవీస్‌ కలవడం ఇదే మొదటిసారి. ఇదిలాఉండగా.. తన క్యాబినెట్‌లో బీజేపీ నుంచి మంత్రులయ్యే అవకాశం ఉన్న వారి జాబితా సిద్ధమైందని, దీనిపై పార్టీ కేంద్ర నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని ఫడణవీస్‌ తెలిపారు. రెండు రోజుల పర్యటనకు ఢిల్లీ వచ్చిన ఆయన క్యాబినెట్‌ విస్తరణపై అమిత్‌ షా, జేపీనడ్డా, పార్టీ సీనియర్‌ నేత బీఎల్‌ సంతో్‌షలతో బుధవారం రాత్రి చర్చించారు.

Updated Date - Dec 13 , 2024 | 05:54 AM