Share News

Ajit Pawar: పది రోజులుగా ఉత్కంఠ.. ఢిల్లీకి అజిత్ పవార్

ABN , Publish Date - Dec 02 , 2024 | 07:50 PM

డిసెంబర్ 4న బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ముంబైలో జరుగనుంది. ఇదే సమయంలో డిసెంబర్ 5న కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేస్తుందని బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాంకులే ప్రకటించారు.

Ajit Pawar: పది రోజులుగా ఉత్కంఠ.. ఢిల్లీకి అజిత్ పవార్

న్యూఢిల్లీ: మరో మూడు రోజుల్లో మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వం కొలువుతీరనుండగా కొత్త సీఎం ఎవరనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. ఆరోగ్య కారణాలతో ప్రస్తుత కీలక సమావేశాలను రద్దు చేసుకుని సతారా జిల్లాలోని తన స్వగ్రామంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ సోమవారంనాడు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ప్రభుత్వ ఏర్పాటు, శాఖల కేటాయింపులపై బీజేపీ అగ్రనేతలతో ఆయన సమావేశం కానున్నారు.

Maharashtra: బీజేపీ కేంద్ర పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, విజయ్ రూపాని


కాగా, మహాయుతి నేతల మధ్య ముంబైలో సోమవారంనాడు ఎలాటి సమావేశం లేదని, కూటమిలో ఏకైక పెద్ద పార్టీ మీటింగ్ (బీజేపీ) షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నామని శివసేన వర్గాలు తెలిపాయి. మరోవైపు తాజా ప్రతిష్టంభన నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మహారాష్ట్రకు కేంద్ర పరిశీలకులుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పార్టీ సీనియర్ నేత విజయ్ రూపానిని నియమించారు. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేత ఎంపిక కోసం పరిశీలకులుగా వీరు నియమితులయ్యారు. డిసెంబర్ 4న బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ముంబైలో జరుగనుంది. ఇదే సమయంలో డిసెంబర్ 5న కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేస్తుందని బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాంకులే ప్రకటించారు. దేవేంద్ర ఫడ్నవిస్‌కే సీఎం పగ్గాలు చేపడతారని, అయితే లెజిస్లేచర్ పార్టీ సమావేశంలోనే దీనిపై నిర్ణయం ఉంటుందని, ఆశ్చర్యకరమైన నిర్ణయం ఏదీ బీజేపీ నుంచి రాదని ఆయన వెల్లడించారు. బీజేపీకే సీఎం పోస్ట్ వెళ్తుందని ఇప్పటికే అజిత్ పవార్ ప్రకటించనందున ఫడ్నవిస్ ఎంపిక లాంచనప్రాయమే అవుతుందని మహాయుతి నేతలు చెబుతున్నారు.


నవంబర్ 23న వెలువడిన మహారాష్ట్ర ఫలితాల్లో మహాయుతి కూటమి ఘనవిజయం సాధించింది. బీజేపీ 132 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా, కూటమి భాగస్వాములైన ఏక్‌నాథ్ షిండే శివసేన 57, అజిత్ పవార్ ఎన్‌సీపీ 41 సీట్లు గెలుచుకున్నాయి. సీఎం పదవిపై గత పది రోజులుగా ఉత్కంఠ కొనసాగుతుండగా కొత్త ప్రభుత్వం ఏర్పాటులో జాప్యం జరుగుతోంది.


ఇది కూడా చదవండి

Sabarmati Report: పార్లమెంటులో 'సబర్మతి రిపోర్ట్'ను వీక్షించనున్న మోదీ

Farmers Protest Impact: రైతుల నిరసన ఎఫెక్ట్.. ఎక్స్‌ప్రెస్‌వేపై 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

Cyclone Fengal Impact: ఫెంగల్ తుపాను కారణంగా 19 మంది మృతి.. ఎక్కడెక్కడంటే..

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 02 , 2024 | 07:50 PM