Maharashtra: ప్రమాణస్వీకారాన్ని బహిష్కరించిన ఎంవీఏ ఎమ్మెల్యేలు
ABN , Publish Date - Dec 07 , 2024 | 03:41 PM
బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కాళిదాస్ కొలాంబ్కర్‌ను ప్రోటెం స్పీకర్‌గా గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ శుక్రవారంనాడు నియమించారు. తక్కిన 287 మంది ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణస్వీకారం చేయిస్తారు. డిసెంబర్ 9న అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.
ముంబై: మహారాష్ట్రలో 'మహాయుతి' ప్రభుత్వం కొలువుతీరడం, మూడు రోజుల అసెంబ్లీ ప్రత్యేక సమావేశం శనివారంనాడు ప్రారంభమైన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈరోజు జరగాల్సిన ప్రమాణస్వీకారాన్ని 'మహా వికాస్ అఘాడి' (Maha Vikas Aghadi) ఎమ్మెల్యేలు బహిష్కరించారు. శివసేన (UBT) నేత, మాజీ మంత్రి ఆదిత్య థాకరే ఈ విషయాన్ని ప్రకటించారు. ఎమ్మెల్యేలుగా దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ సహా పలువురు శనివారంనాడు ప్రమాణస్వీకారం చేశారు.
Maharashtra: ఎంవీఏకు దెబ్బమీద దెబ్బ.. జారిపోయిన ఎస్‌పీ
''ఎంవీఏలో భాగమైన శివసేన (యూబీటీ) ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయడం లేదు. ఈవీఎంలపై మాకు అనుమానాలు ఉన్నాయి. ఈ ఫలితాలపై ప్రజలు సంతృప్తిగా లేవు. ప్రజలిచ్చిన తీర్పే అయితే వారంతా సంతోషంగా ఉండేవారు. అలా జరగలేనందునే ఎక్కడా విజయోత్సవాలు కనిపించడం లేదు'' అని థాకరే అన్నారు. ప్రజాస్వామ్యం హత్యకు గురైందని ఆరోపించారు.
కాగా, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కాళిదాస్ కొలాంబ్కర్‌ను ప్రోటెం స్పీకర్‌గా గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ శుక్రవారంనాడు నియమించారు. తక్కిన 287 మంది ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణస్వీకారం చేయిస్తారు. డిసెంబర్ 9న అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వంపై 'ట్రస్ట్ ఓట్', ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
ఇవి కూడా చదవండి...
Shooting: పట్టపగలు దారుణం.. మార్నింగ్ వాక్ వెళ్లిన వ్యాపారిపై కాల్పులు, హత్య
Minister: మంత్రి కీలక వ్యాఖ్యలు.. అధికార పంపిణీ ఒప్పందం వాస్తవమే..
Read More National News and Latest Telugu News